Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. రాజధాని దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Sajjala Ramakrishna Reddy Got Criminal Case
ఇటీవల జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని మహిళలు ఆందోళనకు దిగారు. అయితే ఈ నిరసనలో పాల్గొన్న మహిళలు సంకరజాతివారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలు దళిత సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. దీనిపై శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
తనపై కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయనకు బెయిల్ మంజూరు కాకూడదంటూ దళిత జేఏసీ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు రిజిస్టర్ కావడం, దర్యాప్తు ప్రారంభమవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యలపై, తదుపరి విచారణ ప్రక్రియపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
Also Read : PM Modi Important Call : తక్షణ శాంతులకై ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కాల్















