Sekhar Kammula : తెలుగు సినీ పరిశ్రమలో ‘హ్యాపీడేస్’, ‘లీడర్’, ‘లవ్ స్టోరీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula), ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమాను జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Sekhar Kammula Shocking Comments
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగార్జున–ధనుష్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు కూడా చిత్రబృందం జోరుగా నిర్వహిస్తోంది.
తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడుతూ, ధనుష్ నటన చూసి తాను ఆశ్చర్యపోయిన విషయం పంచుకున్నారు. “ధనుష్ కూడా ఒక దర్శకుడే కాబట్టి, షూటింగ్ సమయంలో ఆయన అభిప్రాయాలు, సూచనల విషయంలో కొంత టెన్షన్‌గా ఉండేవాడిని. కానీ, ప్రతి సీన్‌ను ఆయన సింగిల్ టేక్‌లో పూర్తి చేశాడు. అంతేకాదు, హీరో మాత్రమే కాకుండా సింగర్, రచయిత కూడా అయిన ధనుష్ నిజమైన మల్టీటాలెంటెడ్ ఆర్టిస్టు” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
“నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ శార్బ్‌లతో కలిసి పని చేయడం నాకు ఇదే మొదటిసారి. నాగార్జునతో మునుపటినుండి పరిచయం ఉండడంతో ఎలాంటి అణకువలు లేకుండా వర్క్ చేశాం. జిమ్ శార్బ్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలడనుకున్నా, మొదటి సన్నివేశంలోనే తెలుగు, తమిళంలో డైలాగులు స్వేచ్ఛగా పలికి ఆశ్చర్యపరిచాడు” అని తెలిపారు.
పాత్రల అవసరాన్ని బట్టి నటులను ఎంచుకున్నానని, ‘కుబేర’ కథ ఆలోచన తలకెత్తినప్పుడు అది తనకు అదృష్టంగా భావించానని శేఖర్ చెప్పారు. ముంబయిని నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కథకు తగ్గట్టే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు చెప్పారు.
Also Read : Hero Vijay Sethupathi-Puri : పూరి దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జోడి దొరికిందా..















