Agriculture – Pharmacy 2025 Interesting :రేపే అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ సీట్ల సెల‌క్ష‌న్ జాబితా

వెల్ల‌డించ‌నున్న ఏపీ ఈఏపీసీఈటీ 2025

Hello Telugu - Agriculture - Pharmacy 2025 Seats Relief

Hello Telugu - Agriculture - Pharmacy 2025 Seats Relief

Agriculture : ఏపీ స‌ర్కార్ నిర్వ‌హించిన ఏపీ ఈఏపీసీఈటీ 2025 అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ సీట్ల కేటాయింపు రిజ‌ల్ట్స్ ఈనెల 25న బుధ‌వారం విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఏపీ రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి. వ్య‌వ‌సాయ‌, ఫార్మ‌సీ స్ట్రీమ్స్ కు సంబంధించిన రెండ‌వ ద‌శ కౌన్సిలింగ్ పూర్త‌యింద‌ని తెలిపింది. ఇప్ప‌టికే తొలి విడ‌త కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి లిస్టు రిలీజ్ చేశామ‌ని పేర్కొంది. తాజాగా రెండో జాబితాను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది విద్యా మండ‌లి.

AP Agriculture and Pharmacy Results Update

కాగా రెండో విడ‌త కౌన్సెలింగ్ కోసం హాజ‌రైన ద‌ర‌ఖాస్తు దారులు తాము ఎంపిక‌య్యామో లేదోన‌న్న విష‌యాన్ని అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల‌ని సూచించింది. ఏమైనా అనుమానాలు ఉన్న‌ట్ల‌యితే వెంట‌నే నివృత్తి చేసుకోవాల‌ని, ఈ మేర‌కు ఆప్ష‌న్ కూడా ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపింది.
ఇదిలా ఉండ‌గా స‌ప్లిమెంట‌రీ ఎలిజబిలిటీ క‌లిగిన క్యాండిడేట్స్ కూడా ర్యాంక్ కేటాయించామ‌ని స్ప‌ష్టం చేసింది ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి.

ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జూన్ 28న ర్యాంకుల‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది. త‌మ ద‌ర‌ఖాస్తు వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా స‌రిగా న‌మోదు చేయాల‌ని సూచించింది. ఏమైనా ద‌ర‌ఖాస్తుల‌లో లోపాలు ఉన్న‌ట్ల‌యితే ర్యాంకుల‌ను కేటాయించ‌డం కుద‌ర‌ద‌ని తెలిపింది. అందుకే అభ్య‌ర్థులు విధిగా త‌నిఖీ చేసుకోవాల‌ని సూచించింది. హాల్ టికెట్ నెంబ‌ర్ నమోదు చేస్తే వివ‌రాలు వెల్ల‌డి అవుతాయ‌ని పేర్కొంది.

Also Read : Gold Rates Today : మధ్యప్రాచ్యంలో అలజడులు నేపథ్యంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Exit mobile version