Shashi Tharoor Shocking : శశిథరూర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ఈ ఉప ఎన్నికల ప్రచారానికి ఎంపీ శశిథరూర్ పేరు కూడ్లున్న స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉంది..

Hello Telugu - Shashi Tharoor Shockingq

Hello Telugu - Shashi Tharoor Shocking

Shashi Tharoor : కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తనను ప్రచారానికి ఆహ్వానించలేదని తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ తెలిపారు. ఈ ప్రకటన అనంతరం, కాంగ్రెస్ పార్టీ (Congress) స్పందించింది. శుక్రవారం, కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్ విలేకరులతో మాట్లాడుతూ, “ఈ ఉప ఎన్నికల ప్రచారానికి ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేరు కూడ్లున్న స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉంది” అని తెలిపారు.

Shashi Tharoor Shocking

అదే సమయంలో, ఆ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కానీ, ఈ విషయంలో ఆయన మరింత వివరణ ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొన్నారు. “కాగా, ఈ ఉప ఎన్నికల ప్రచారానికి కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని తప్ప, మిగతా నేతలు అందరూ సహకరించారని” సన్నీ జోసఫ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అర్యాదన్ షౌకత్‌కు మద్దతుగా రమేశ్ చన్నీతాల, కె. సురేశ్ ప్రచారంలో పాల్గొనడం గమనార్హమని ఆయన వెల్లడించారు.

గురువారం, విలేకరులు శశిథరూర్‌ను అడిగిన ప్రశ్నపై ఆయన సమాధానం ఇస్తూ, ‘‘తనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేద’’ అని స్పష్టంగా చెప్పారు. అలాగే, ఆ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్ ఈ విషయంపై ఎలా స్పందించారో వివరించారు.

జూన్ 19వ తేదీన, నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానమూ ఉంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23వ తేదీన వెలువడనున్నాయి.

ఈ సందర్భంలో, కాంగ్రెస్ పార్టీలో కొన్ని అగ్రనేతలతో తనకు మధ్య పెరిగిన మాటలు వాస్తవమని ఇప్పటికే శశిథరూర్ ప్రకటించారు.

మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ “ఆపరేషన్ సిందూర్” చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రదాడి కారణంగా భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని వివిధ దేశాలకు తెలియజేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో, కేంద్రం వివిధ రాజకీయ పార్టీ ఎంపీలతో 7 బృందాలను ఎంపిక చేసింది. ఆ జాబితాలో ఒక బృందానికి శశిథరూర్ నాయకత్వం వహించారు.

ఇంకో వైపు, మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఎంపీల పేర్ల జాబితాను పంపాలని కోరింది. అయితే, కాంగ్రెస్ ఎంపిక చేసిన ఎంపీల జాబితాను కాకుండా, మోదీ ప్రభుత్వం శశిథరూర్ పేరు ఎంపిక చేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించింది. ఇది కూడా గమనార్హం, ఇటీవల మోదీ ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలతో శశిథరూర్ సన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Israel vs Iran Attack : మొదటిసారి ఇజ్రాయెల్ పై క్లస్టర్ బాంబులు ప్రయోగించిన ఇరాన్

Exit mobile version