Iskcon Temple : అమెరికా – అమెరికాలోని ఇస్కాన్ ఆలయాన్ని(Iskcon Temple) లక్ష్యంగా చేసుకున్నారు దుండగులు. కాల్పులకు తెగబడ్డారు. 20 నుంచి 30కి పైగా బుల్లెట్లు గుడి గోడల్లోకి దూసుకు పోయాయి. ఈ ఘటన జరిగిన సమయంలో భక్తులు లోపల ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ప్రతి ఏటా ఈ ఆలయంలో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
Iskcon Temple Gun Firing in America
వార్షిక హోలీ పండుగను నిర్వహించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఉటాలోని స్పానిష్ ఫోర్క్‌లోని ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా కృష్ణ ఆలయం. ప్రాంగణంలో రెండు డజన్లకు పైగా బుల్లెట్లు పేల్చబడ్డాయి, దీని వలన గణనీయమైన నిర్మాణ నష్టం జరిగింది. రాత్రి పూట భక్తులు, అతిథులు గుడి లోపల ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు మూకుమ్మడిగా కాల్పులకు తెగబడడం కలకలం రేపింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి సంఘటనే జరిగింది. మార్చి 9న, కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా ఉత్తర అమెరికా హిందువుల కూటమి ఎక్స్ వేదికగా స్పందించింది. ఇస్కాన్ టెంపుల్ పై దాడికి దిగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజుకు అమెరికాలో రక్షణ కరువైందని వాపోయింది.
Also Read : Deputy CM Pawan Shocking Case : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై క్రమినల్ కేసు















