Peddireddy : బుగ్గమఠం భూముల వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడతామని డివిజన్ బెంచ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో, గత నెల 28న పెద్దిరెడ్డి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
Peddireddy Ramachandra Reddy Shocking
ఈ పిటిషన్‌పై సోమవారం నాడు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పెద్దిరెడ్డి (Peddireddy) తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తమ వాదనలు వినిపించారు.
వాదనలు వినిన అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలనే పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై డివిజన్ బెంచ్‌దే తుది నిర్ణయం అవుతుందని స్పష్టం చేసింది. కేసులో (వాస్తవాల సాంకేతిక విశ్లేషణ) లోకి తాము వెళ్లడం లేదని తేల్చిచెప్పింది.
అంతేకాదు, రెండు వారాల పాటు బుగ్గమఠం భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ అనంతరం అవసరమైన చర్యలు తీసుకునే హక్కు హైకోర్టుకు ఉన్నదని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో, ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. ఈ పరిణామాలతో భూ వివాదం తుది నిర్ణయం కోసం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడి ఉండనుంది.
Also Read : Home Minister Anitha Shocking : జగన్ కు రాజకీయ లబ్ధి తప్ప ప్రజల ప్రాణాలపై లెక్కలేదు















