Passport Verification – TG Popular : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

వెరి ఫాస్ట్ యాప్ దేశంలోనే అత్యుత్త‌మ అవార్డు

Hello Telugu -Passport Verification - TG Popular

Hello Telugu -Passport Verification - TG Popular

Passport : తెలంగాణ పోలీసులు అరుదైన ఘ‌న‌త సాధించారు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. పాస్ పోర్ట్ వెరిఫికేష‌న్ కు సంబంధించిన త‌యారు చేసిన వెరి ఫాస్ట్ యాప్ టాప్ లో నిలిచింది. అత్యుత్త‌మ అవార్డును గెలుచుకుంది. ఇది పోలీసుల ప‌నితీరుకు అద్దం ప‌డుతుంది. గ‌త ప్ర‌భుత్వంతో పాటు ఇప్ప‌టి స‌ర్కార్ డిజిట‌ల్ టెక్నాల‌జీకి ప్ర‌యారిటీ ఇస్తుంది. వెరి ఫాస్ట్ వెరిఫికేష‌న్ లో దేశంలోనే అగ్ర స్థానం సంపాదించ‌డం మామూలు విష‌యం కాదు.

Passport Verification Telangana in Top Position

వెరిఫికేష‌న్ లో భాగంగా పాస్ పోర్టుల‌ను (Passport) వేగవంతం చేయడం, ఖచ్చితత్వాన్ని మెరుగు పరచడం పారదర్శకతను పెంచడంలో వెరీ ఫాస్ట్ యాప్ అంద‌రి మ‌న‌న్న‌లు పొందింది. కేంద్ర స‌ర్కార్ ఈ మేర‌కు దాని ప‌నితీరును ప్ర‌శంసించింది. జాతీయ స్థాయిలో ఈ యాప్ ప్ర‌శంస‌లు అందుకుంది. విదేశాల‌కు వెళ్లాలంటే ప్ర‌తి ఒక్క‌రు పాస్ పోర్టును క‌లిగి ఉండాల్సి ఉంటుంది. లేక‌పోతే వెళ్లేందుకు ఆస్కారం ఉండ‌దు. పోలీస్ వెరిఫికేష‌న్ త‌ప్ప‌నిస‌రి. ఏమైనా కేసులు, లేదా ఇత‌ర క్రిమిన‌ల్ బ్యాగ్రౌండ్ ఉందా అని అన్ని ర‌కాలుగా ప‌రిశీలిస్తారు. మ‌నం ఇచ్చిన వివ‌రాలు స‌క్ర‌మంగా ఉన్నాయో లేదోన‌ని ధ్రువీక‌రిస్తారు.

ఇక పాస్ పోర్టు వెరిఫికేష‌న్ లో భాగంగా పోలీసులు మూడు ప‌ని దినాల లోపు పాస్ పోర్టుల‌ను ప‌రిశీలిస్తారు.
ప్ర‌తి రోజూ 2 వేల కంటే ఎక్కువ‌గా వెరిఫికేష‌న్స్ జ‌ర‌గ‌డం విశేషం. గ‌తంలో వెరీ ఫాస్ట్ యాప్ లేని స‌మ‌యంలో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక ఎప్పుడైతే టెక్నాల‌జీని అనుసంధానం చేశారో అప్ప‌టి నుంచి పాస్ పోర్ట్ వెరిఫికేష‌న్ మ‌రింత సౌల‌భ్యంగా మారి పోయింది. ప్ర‌తి ఏటా 8 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా ప్ర‌సాస్ చేస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేష‌న్ ఆఫీస‌ర్స్, ఇన్సెప‌క్ట‌ర్లు, ఏసీపీలు, ప్ర‌త్యేక పాస్ పోర్టు వెరిఫికేష‌న్ సెల్ లు దీనిపై ఫోక‌స్ పెట్టాయి.

Also Read : LPG Cylinder Shocking : త్వరలో ఆకాశన్నంటనున్న గ్యాస్ సిలిండర్ ధరలు

Exit mobile version