Saketh Myneni : అమరావతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఏపీకి చెందిన శ్రీ సాకేత్ సాయి మైనేని (Saketh Myneni) టెన్నిస్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు.
Saketh Myneni Gets Group-1 Postion
శ్రీ సాకేత్ సాయి మైనేని 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతే కాకుండా పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే 2016 , 2019 సంవత్సరాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలను సాధించాడు శ్రీ సాకేత్ మైనేని. మొత్తంగా 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్, 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
శ్రీ సాకేత్ మైనేని అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు ప్రదానం చేయబడింది. భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా తనను రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమించాలని ప్రతిపాదించడం జరిగింది. శ్రీ సాకేత్ సాయి మైనేని నియామకం గురించిన ప్రతిపాదన మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాగా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Also Read : AP Cabinet Strong Decisions : మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ



















