TG News Shocking : తెలంగాణలో భారీ పేలుడు ఇద్దరికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది...

Hello Telugu - TG News Shocking

Hello Telugu - TG News Shocking

TG News : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్‌లో పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్‌లో పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మెట్రో పిల్లర్‌ నెంబర్‌-136 దగ్గర పెట్రోల్‌ బంక్‌లోఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది.

TG News Updates

ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరగడంతో స్థానికులను దూరంగా పంపించి వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : PM Narendra Modi-Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలంచనున్న ప్రధాని

Exit mobile version