YS Sharmila Effective Comments : ఏపీకి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ మాత్ర‌మే

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కామెంట్స్

Hello Telugu - YS Sharmila Effective Comments

Hello Telugu - YS Sharmila Effective Comments

YS Sharmila : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఒక్క‌టే త‌మ ముందున్న ప్ర‌ధాన ఎజెండా అని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా రాష్ట్రాభివృద్ది గురించి ఆలోచించ‌డం లేద‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు బీజేపీకి తొత్తులంటూ ఎద్దేవా చేశారు.

YS Sharmila Effective Comments on AP Govt

ఇక త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ద‌త్త పుత్రుడంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం ఒక్క పోరాటం చేసిన పాపాన పోలేద‌న్నారు. చంద్ర‌బాబు,పవన్ క‌ళ్యాణ్ ల‌ది సక్రమ పొత్తు అని, జ‌గ‌న్ ది అక్ర‌మ పొత్తంటూ ఆరోపించారు. బీజేపీ నీ ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

ప్రజల పక్షాన పోరాటాలు చేసేది కాంగ్రెస్ మాత్ర‌మేన‌ని అన్నారు. విభజన హామీలపై బీజేపీ దారుణంగా మోసం చేసిందన్నారు. బీజేపీ మోసాలపై కూటమి పార్టీలు,YCP మౌనం గా ఉన్నాయన్నారు.
బీజేపీ అన్యాయంపై ప్రశ్నించడం లేదన్నారు. విభజన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ తోనే విభజన హామీలు సాధ్యమ‌న్నారు. బీజేపీ ఎదురు నిలిచి పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీనేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాల్టితో 26 జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : CM Chandrababu Record Breaking : ప్ర‌జ‌ల‌తో మ‌మేకం విజ‌యానికి సోపానం – చంద్ర‌బాబు

Exit mobile version