Vallabhaneni Vamsi : అమరావతి – వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జైలులో ఉన్న తనకు ఊరటనిస్తూ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించింది కూటమి సర్కార్. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) బెయిల్ మంజూరు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Vallabhaneni Vamsi Shocking
నకిలీ ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశారంటూ తనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వంశీపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి గత ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ నోరు జారారు. అనరాని మాటలు అన్నారు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్ ల గురించి. దీనిపై సీరియస్ గా తీసుకుంది సర్కార్. వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేకించి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి తీరుతామంటూ సంచలన ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తంగా వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై వంశీ కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Also Read : Kodandaram Reddy Growth : భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ గా కోదండరాం రెడ్డి
