Kodandaram Reddy : హైదరాబాద్ – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డిని (Kodandaram Reddy) నియమించింది ప్రభుత్వం. కన్వీనర్ గా మామిడి హరికృష్ణ, సభ్యులుగా సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డా.అలేఖ్య పుంజాల, సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, బి.నర్సింగరావు, జయరాజ్, సంగిశెట్టి శ్రీనివాస్, కోయి కోటేశ్వరరావు, పసునూరి రవీందర్, అంతుపుప్పూరు రవీందర్, అంతుపూరు రవీందర్, దరువు ఎళ్లై నాగర్రాజు, ఒగ్గు రవి కుమార్, నెర్నాల కిషోర్, గ్రామ నరసింహ, ఖాజా పాషా, జాకబ్, జూకంటి జగన్నాథం, దరువు అంజన్నను నియమించింది.
Kodandaram Reddy As a Chiarman of Telangana Language
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వివిధ సంస్థలను, మేధావులను, పార్టీలను సమన్వయం చేయడంలో ముఖ్య భూమిక వహించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి తర్వాత స్థానంలో తను ఉన్నారు. ఎంతో మందిని ప్రభావితం చేశారు. తెలంగాణ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న కొందరిలో తను కూడా ఒకరు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేశారు. రిటైర్ తర్వాత భావ సారూప్యత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ మేరకు తనకు శాసన మండలి సభ్యుడి పదవిని కట్టబెట్టింది.
Also Read : Modi Cabinet Approved : జాతీయ క్రీడా విధానానికి కేంద్రం ఆమోదం
