CM Siddaramaiah – BJP Shocking Demands :సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా చేయాల్సిందే

డిమాండ్ చేసిన బీజేపీ ప‌క్ష నేత, ఎమ్మెల్సీ ర‌వి

Hello Telugu - CM Siddaramaiah - BJP Shocking Demands

Hello Telugu - CM Siddaramaiah - BJP Shocking Demands

CM Siddaramaiah : క‌ర్ణాట‌క – బీజేపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, ఎమ్మెల్సీ సీటీ ర‌వి నిప్పులు చెరిగారు. అవినీతికి కేరాఫ్ గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం మారి పోయింద‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే దీనికి బాధ్య‌త వ‌హిస్తూ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌తో (CM Siddaramaiah) పాటు గృహ నిర్మాణ వాఖ మంత్రి జ‌మీర్ అహ్మ‌ద్ ఖాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ర‌వి మీడియాతో మాట్లాడారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా అనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

CM Siddaramaiah – BJP Leader Demands to Resign

ఇప్ప‌టికే సీఎంకు సంబంధించిన ఆస్తుల‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అటాచ్ చేసింద‌ని, క‌నీసం నైతిక బాధ్య‌త వ‌హించి త‌న ప‌ద‌విని ఎందుకు వీడ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు సీఎంను ఉద్దేశించి. పైకి నీతులు చెబుతూ లోప‌ల ప్ర‌జా వ్య‌తిరేక ప‌నులు చేస్తే ఎలా ఊరుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని తీరా వాటిని తీర్చ‌లేక అప్పుల కుప్ప‌గా మార్చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు సీటీ ర‌వి.

రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. గ‌త త‌మ ప్ర‌భుత్వంలోనే రాష్ట్రం బాగుండేద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోంద‌ని అన్నారు. రాష్ట్ర విధాన, ప్రణాళిక కమిషన్ డిప్యూటీ చైర్మన్ కూడా అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.ఆర్. పాటిల్ రాష్ట్రంలో గృహ నిర్మాణ కేటాయింపులలో అవినీతి జరుగుతోందని స్వ‌యంగా ఆరోపించార‌ని ఇంత‌కంటే సాక్ష్యం ఇంకేం కావాలంటూ నిల‌దీశారు సీటీ ర‌వి. సిట్టింగ్ జ‌డ్జితో దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు.

Also Read : రేపే అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ సీట్ల సెల‌క్ష‌న్ జాబితా

Exit mobile version