CM Revanth Shocking Comments : నీళ్ల వాటా విష‌యంలో రాజీ ప‌డేది లేదు – సీఎం

ఏపీ స‌ర్కార్ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు కేసీఆరే కార‌ణం

Hello Telugu - CM Revanth Shocking Comments

Hello Telugu - CM Revanth Shocking Comments

CM Revanth : హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఏపీ స‌ర్కార్ గోదావ‌రి నీళ్ల‌ను త‌ర‌లించుకు పోయే విష‌యంపై ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్వాకం కార‌ణంగానే ఇవాళ ఇన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ఆరోపించారు. అడ్డ‌గోలుగా అంచ‌నాలు పెంచుకుంటూ పోయార‌ని, కేవ‌లం కాంట్రాక్ట‌ర్లు లాభ ప‌డేందుకే ఇలా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

CM Revanth Reddy Shocking Comments

ఇదే స‌మ‌యంలో తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చారంటూ వాపోయారు. లంకె బిందులు ఉన్నాయ‌ని చూస్తే ఖాళీగా ఖ‌జానా క‌నిపించింద‌న్నారు. ఇప్ప‌టికే రూ. 7 ల‌క్ష‌ల కోట్లకు పైగా అప్పులు మిగిలించి వెళ్లార‌ని, వాటికి వ‌డ్డీలు క‌ట్టేందుకు బ‌య‌ట నుంచి అప్పులు తీసుకు రావాల్సి వ‌స్తోంద‌న్నారు రేవంత్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం కోసం ల‌క్ష కోట్లు త‌గ‌లేశార‌ని, దాని వ‌ల్ల కేవ‌లం 50 వేల ఎక‌రాలకు మాత్ర‌మే నీళ్లు అందుతున్నాయ‌ని, దీని వ‌ల్ల లాభం లేద‌న్నారు సీఎం.

ఒక ర‌కంగా చెప్పాలంటే తెలంగాణ‌కు మాజీ సీఎం కేసీఆర్ మ‌ర‌ణ శాస‌నం రాశార‌ని ఆరోపించారు. మామ కేసీఆర్, అల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావు తీసుకున్న నిర్ణ‌యాలు తెలంగాణ‌కు గుదిబండ‌గా మారాయ‌న్నారు.
811 టీఎంసీల నీళ్లలో 512 టీఎంసీలు ఆంధ్ర, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే సరిపోతుందని ఆనాడు సంతకాలు పెట్టారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కృష్ణా నదిలో మన వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ లో ఏనాడు వాదించ లేద‌న్నారు ఎ. రేవంత్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ఏనాడు పట్టించు కోలేద‌న్నారు. త‌మ స‌ర్కార్ వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఏ అంశంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ నీటి విషయంలో ఏకాభిప్రాయం ఉందన్నారు.

Also Read : Vallabhaneni Vamsi Shocking : వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ సుప్రీంకోర్టుకు స‌ర్కార్

Exit mobile version