TTD Interesting News :శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్

కియోస్క్ ల ద్వారా ల‌డ్డూల పంపిణీ

hellotelugu-ttd

TTD : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తిరుమ‌ల కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. గ‌త కొంత కాలంగా భ‌క్తులు అమితంగా ఇష్ట‌ప‌డే ల‌డ్డూ ప్రసాదం త‌మ‌కు స‌రిగా అంద‌డం లేద‌ని, కావాల్సినన్ని ల‌డ్డూలు ఇవ్వ‌డం లేదంటూ వాపోయారు. దీనిని గ‌మ‌నించిన టీటీడీ (TTD) కీల‌క తీర్మానం చేసింది. టోకెన్లు క‌లిగిన భ‌క్తుల‌కు అడిగ‌న‌న్ని ల‌డ్డూలు ఇవ్వ‌డం వ‌స్తోంది. అయితే టోకెన్లు లేని భ‌క్తుల‌కు ఆ సంఖ్య త‌గ్గించి ఇవ్వ‌డంతో తీవ్ర ఆవేద‌న చెందారు. దీంతో ప‌రిస్థితిని గ‌మ‌నించారు ఈవో జె. శ్యామ‌ల రావు.

TTD Interesting Updates

ఇక నుంచి పూర్తి పార‌ద‌ర్శ‌కంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను భ‌క్తుల‌కు పూర్తిగా వేగవంతంగా ల‌డ్డూలు ఇచ్చేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు కియోస్క్ ల‌ను ఏర్పాటు చేశారు. ఆయా బ్యాంకులు వీటిని పున‌రుద్ద‌రించాయి. టీటీడీ యూపీఐ ఆధారిత కియోస్క్ ల‌ను ప‌రిచ‌యం చేసింది. ఇక నుంచి క్యూ లైన్ ల‌లో గంట‌ల‌త‌ర‌బ‌డి నిరీక్షించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో. యాత్రికుల సౌల‌భ్యం, సేవా సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు విస్తృతంగా డిజిట‌ల్ సాంకేతిక‌ను వినియోగించు కోనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

దీని ద్వారా లడ్డూ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడానికి లడ్డూ కౌంటర్లలో స్వీయ-సేవా కియోస్క్‌లను ప్రవేశ పెట్టామ‌న్నారు శ్యామ‌ల రావు. ఈ కొత్త కియోస్క్ సౌకర్యం తిరుమల సందర్శన సమయంలో ప్రతి టచ్ పాయింట్ వద్ద సాంకేతికతను స్వీకరించడానికి, భక్తుల సంతృప్తిని పెంచడానికి విస్తృత ప్రయత్నంలో ఇది ఒక భాగ‌మ‌ని పేర్కొంది.

Also Read : Sridhar Deshpande Shocking Comments :ఏపీకి గోదావ‌రి జలాలు కేసీఆర్ ఇవ్వ‌లేదు

Exit mobile version