Egg Interesting Uses : అసలు గుడ్డు మాంసాహారమా శాకాహారమా.?

గుడ్డులను తినే శాఖాహారుల‌ను ఓవో వెజిటేరియన్స్ అనే వర్గంలోకి చేర్చుతారు...

Hello Telugu - Egg Interesting Uses

Hello Telugu - Egg Interesting Uses

Egg : గుడ్డు తినే విషయంలో చాలామంది భారతీయుల్లో ఒక సాధారణ సందేహం ఉంది – ఇది శాఖాహారంలోకే వస్తుందా, లేక మాంసాహారంకు చెందుతుందా అనే ప్రశ్న. అయితే శాస్త్రీయంగా చూస్తే, ఈ అంశంపై స్పష్టత ఉంది.

శాస్త్రవేత్తల ప్రకారం, జంతు మాంసం లేకుండా ఉన్న ఆహారాన్ని శాఖాహారంగా పరిగణిస్తారు. ఈ నిర్వచనాన్ని అనుసరిస్తే, గుడ్డు (Egg) మాంసాహార ఆహారానికి చెందినదిగా పరిగణించదు. గుడ్డులను తినే శాఖాహారుల‌ను ఓవో వెజిటేరియన్స్ అనే వర్గంలోకి చేర్చుతారు.

Egg – గుడ్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి:

ఫలదీకరించబడిన గుడ్లు – ఇవి కోడి పుంజు సహకారంతో కోడి పెట్టిన గుడ్లు. ఇవి కోడి పిల్లలకు జన్మనిచ్చే అవకాశముంటుంది.

ఫలదీకరించబడని గుడ్లు – ఇవి కోడి పుంజుల ద్యానంలేకుండా పెట్టిన గుడ్లు. ఇవి సాధారణంగా ఆహారానికే ఉపయోగపడతాయి. ఇవి శాస్త్రీయంగా శాఖాహారంగానే పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, కొన్నిసార్లు గుడ్లలో కనిపించే చిన్న రక్తపు చుక్కలు వల్ల గుడ్డు మాంసాహారమన్న అపోహ ఉంటుంది. కానీ అది ఫలదీకరణానికి సంకేతం కాదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. కోడి శరీరంలో గుడ్డు తయారీ సమయంలో ఏర్పడే స్వల్ప రక్తనాళాల గాయం వల్ల అవి వస్తాయి.

మరింత విస్తృతంగా చూస్తే, గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తే, పాలను కూడా మాంసాహారం అనే అభిప్రాయం రావాల్సి ఉంటుంది, ఎందుకంటే పాలు కూడా జంతువుల నుంచే వస్తాయి. అయితే పాలను శాఖాహారంగా తీసుకుంటున్నట్లే, గుడ్డు కూడా శాస్త్రీయంగా శాఖాహార విభాగంలోకి వస్తుంది అని నిపుణులు వివరిస్తున్నారు.

తద్వారా, గుడ్డు తినడం శాస్త్రీయ దృష్టికోణంలో శాఖాహారానికి భంగం కలిగించదని భావించవచ్చు. అయితే వ్యక్తిగత నమ్మకాల్ని బట్టి ఈ విషయంలో అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు.

Also Read : Elon Musk Exclusive : జనాభా తగ్గుదలపై మళ్లీ ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్

Exit mobile version