Empty Stomach – Danger Fruits : ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకూడదు

గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Empty Stomach - Danger Fruits

Hello Telugu - Empty Stomach - Danger Fruits

Empty Stomach : పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలు అందించగలవు. అయితే వాటిని తినే విధానం, సమయం కూడా చాలా ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం కొన్ని పండ్లను ఖాళీ కడుపుతో తినడం వలన అజీర్ణం, కడుపు సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Empty Stomach – ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు

1. పైనాపిల్ (అనాస పండు):

రుచికరమైన పైనాపిల్‌లో (Pineapple) పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఖాళీ కడుపుతో దీనిని తినడం మంచికాదని వైద్యులు చెబుతున్నారు. ఈ పండులో ఉన్న బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉండటంతో, ఖాళీ కడుపులోకి వెళ్లినపుడు కడుపులోని మృదుపరదరంపై ప్రభావం చూపి కంటి మంట, అలర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు కలిగించవచ్చు.

2. జామ పండ్లు:

జామ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటంతో ఇవి జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి. కానీ ఖాళీ కడుపుతో తినడం వల్ల అధిక ఫైబర్ కారణంగా అజీర్ణం, కడుపు నొప్పి, వాయువు, ఉబ్బసం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి జామ పండ్లను భోజనం అనంతరం తీసుకోవడం ఉత్తమం.

3. బొప్పాయి (పపాయా):

రక్తహీనత నివారణకు బొప్పాయి చాలా మంచిదిగా భావించబడుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కొంతమందికి కడుపులో అసౌకర్యం, వాయువు, ఉబ్బరానికి దారి తీయవచ్చని వైద్యుల అభిప్రాయం.

4. ఆపిల్:

ఆపిల్ (Apple) తినడం వల్ల శక్తి లభిస్తుందని చెప్పినా, దీనిలో సహజ ఆమ్లాలు ఉండటంతో ఖాళీ కడుపుతో తినడం మంచికాదు. దీనివల్ల కడుపులో ఆమ్లం పెరిగి, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణుల హెచ్చరిక.

5. అరటి పండు:

పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉండే అరటి పండు ఎముకల బలానికి మేలు చేస్తుంది. అయితే ఖాళీ కడుపుతో అరటి పండు తినడం గుండెకు నష్టం కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మెగ్నీషియం స్థాయిని ఒక్కసారిగా పెంచుతుంది. కాబట్టి దీనిని భోజనం తరువాత తీసుకోవడం ఉత్తమం.

పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా, అవి ఎప్పుడు, ఎలా తింటున్నామనే అంశం మరింత ముఖ్యమైనది. ఖాళీ కడుపుతో తినే కొంతమంది పండ్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణుల హెచ్చరిక. కనుక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో సరైన రీతిలో పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : Lord Surya Interesting Tips : సూర్య భగవానుడికి ఇలా పూజ చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం

Exit mobile version