MLA Harish Rao Shocking Comments : స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ప్ర‌భుత్వం విఫ‌లం – హ‌రీశ్ రావు

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన అందించ‌డంలో ఫెయిల్

Hello Telugu - MLA Harish Rao Shocking Comments

Hello Telugu - MLA Harish Rao Shocking Comments

Harish Rao : సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 37 మంది మృతి చెందారు. మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డింది. మంత్రి దామోద‌ర ద‌గ్గ‌రుండి ప‌రిశీలిస్తున్నారు. పీఎం, సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

MLA Harish Rao Shocking Comments

ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అక్క‌డికి వెళ్లారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao). ఈ సంద‌ర్బంగా బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ ప్రావీణ‌, ఎస్పీతో మాట్లాడారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరు గురించి ఆరా తీశారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో జాప్యం జ‌ర‌గ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇది పూర్తిగా ముమ్మాటికీ స‌ర్కార్ వైఫ‌ల్యమేన‌ని ఆరోపించారు. పేలుడు ఘ‌ట‌న‌లో బాధితుల‌కు రూ. 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరారు. ఇంత పెద్ద ఎత్తున ఘ‌ట‌న జ‌రిగితే కార్మిక శాఖ‌, ప్ర‌భుత్వం ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు.

Also Read : Pashamylaram Shocking Incident : పాశ‌మైలారం పెను విషాదం..37కి చేరిన మృతుల సంఖ్య

Exit mobile version