Indian Govt Shocking : ఏపీకి కేంద్రం బిగ్ షాక్..బ‌న‌క‌చ‌ర్లకు అనుమతి ఇవ్వ‌లేం

ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి ఇవ్వ‌లేమన్న నిపుణుల క‌మిటీ

Hello Telugu - Indian Govt Shocking

Hello Telugu - Indian Govt Shocking

Indian Govt : ఢిల్లీ – కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీకి. ఇప్ప‌టి దాకా పోల‌వ‌రం – బ‌న‌క‌చ‌ర్ల (Banakacherla) క‌ట్టి తీరుతామ‌ని, కేంద్రం కూడా అనుమ‌తి ఇచ్చింద‌ని, ఇక 200 టీఎంసీల మిగులు జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కానీ ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఇప్ప‌టికే డీపీఆర్ కూడా పూర్త‌యింద‌ని, దానికి కూడా ప‌ర్మిష‌న్ వ‌చ్చింద‌ని చెప్పారు. తీరా చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది మోదీ ప్ర‌భుత్వం. ఇది పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణానికి భంగం క‌లిగించేలా ఉంద‌ని నిపుణుల క‌మిటీ పేర్కొంది.

Indian Govt Shocking to AP Govt

ఇదిలా ఉండ‌గా తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం – బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వ‌లేమంటూ స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్. ఈ మేర‌కు నిపుణుల క‌మిటీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.బ‌న‌క‌చ‌ర్ల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవంటూ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని తెలిపింది. అనుమతి ఇవ్వాలంటే జీడబ్ల్యూడీటీ అవార్డును పరిశీలించాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంట్రల్ సాధికార కమిటీ (సీఈసీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) నిర్మాణానికి అనుమతి ఇవ్వ‌లేమంటూ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1983 తీర్పు నిబంధనలను ఉల్లంఘించిందని, దీనిని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ జూన్ 19న కేంద్ర మంత్రిని క‌లిసి తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు మ‌ట్టే మిగులుతుంద‌ని ఆరోపించారు.

Also Read : MLA Harish Rao Shocking Comments : స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ప్ర‌భుత్వం విఫ‌లం – హ‌రీశ్ రావు

Exit mobile version