Journalist Swetcha : హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించిన టీ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ స్వేచ్ఛ ఓట్కర్ కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. సూసైడ్ కాదని పూర్తిగా హత్యేనంటూ సంచలన ఆరోపణలు చేశారు స్వేచ్ఛ (Journalist Swetcha) పేరెంట్స్. ఈ మేరకు తండ్రి తెలంగాణ శంకర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్ రావు ఉన్నట్టుండి నిన్న రాత్రి 11 గంటలకు లొంగి పోయాడు.
Journalist Swetcha Case Updates
జడ్జి ముందు హాజరు పర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. పూర్ణ చందర్ రావును చంచల్ గూడ జైలుకు తరలించారు. తన స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఓ బీఆర్ఎస్ నేత పేరు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున టాక్. తనకు సంబంధించినవన్నీ సదరు నేతకు తెలుసంటూ స్వేచ్ఛను బెదిరించాడని టాక్. పెళ్లి చేసుకుంటానని, భర్తతో విడాకులు తీసుకోమంటూ చెప్పి మోసం చేశాడు. తన మాటలు నమ్మిన స్వేచ్ఛ , భర్తకు విడాకులు ఇచ్చింది.
వారం రోజుల కిందట ఇద్దరూ కలిసి అరుణాచలం వెళ్లారు. మూడు రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, పెళ్లి చేసుకోలేనంటూ చెప్పినట్లు సమాచారం. తనను ఏం చేయలేవని, తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చాడని, తను రిలేషన్ లో ఉన్న విషయం సంతోష్ రావుకు తెలుసని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Also Read : YS Sharmila Effective Comments : ఏపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే
