Kala Venkatarao Warning to Botcha : ఉత్తరాంధ్ర ద్రోహి బొత్స సత్యనారాయణ

కిమిడి కళా వెంకటరావు షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Kala Venkatarao Warning to Botcha

Hello Telugu - Kala Venkatarao Warning to Botcha

Kala Venkatarao : అమ‌రావ‌తి – టిడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యులు కిమిడి క‌ళా వెంక‌టరావు (Kala Venkatarao) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య నారాయ‌ణ‌ను ఏకి పారేశారు. సొంత లాభమే అజెండాగా రాజకీయాలు చేసే బొత్స‌ కూటమి ప్రభుత్వ ప్రజా రంజక పాలనపై విమర్శలు చేయడం దారుణంగా ఉంద‌న్నారు. పేరుకే ఉత్తరాంధ్ర నాయకుడు, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో టీసీఎస్, కాగ్నిజాంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రకు తీసుకొస్తే… మీరు భూ కబ్జా రాయుళ్లను, దోపిడీ దారులను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు.

Kala Venkatarao Slams Botcha Satyanarayana

బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) రాజకీయ జీవితంలో ఒక్క మంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజల కోసం చేయ లేద‌న్నారు. పైగా గత టీడీపీ హయాంలో వచ్చిన అనేక పరిశ్రమలను అధికారంలోకి వచ్చిన వెంటనే తరిమేశారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాటాలు వేసుకొని వైసీపీ నేతలు భూ దోపిడీ చేశారని మండిప‌డ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అడ్డుకున్నారని ఆరోపించారు క‌ళా వెంక‌ట‌రావు.

రుషికొండను బోడిగుండు చేశారని ధ్వ‌జ‌మెత్తారు. ఇవన్ని బొత్స సత్యనారాయణ మరిచి పోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కేలవం కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపు కోవడమే వైసీపీకి, జగన్ రెడ్డికి వచ్చిన విద్య అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందన్నారు. 80 శాతం భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పూర్తి చేశామ‌న్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను, విశాఖ రైల్వే జోన్ ను సాధించామ‌న్నారు. కుల, మత, ప్రాంతాలనే తారతమ్యం లేకుండా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని ప్ర‌శంసించారు.. సీఎం చంద్రబాబు చొరవతో రాజధాని అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.

Also Read : Hero Vijay Antony – Maargan : నూత‌న ప్ర‌యోగం మార్గాన్ సంచ‌ల‌నం

Exit mobile version