Hero Vijay Antony – Maargan : నూత‌న ప్ర‌యోగం మార్గాన్ సంచ‌ల‌నం

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ ఆంటోనీ కీ రోల్

Hello Telugu - Hero Vijay Antony - Maargan

Hello Telugu - Hero Vijay Antony - Maargan

Maargan : కోలీవుడ్ లో విభిన్న‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు విజ‌య్ ఆంటోనీ. త‌ను న‌టించిన తాజా చిత్రం మార్గాన్ (Maargan). దీనిని పూర్తిగా హార‌ర్, రొమాంటిక్ క‌థతో తీర్చిదిద్దాడు. సంగీత ద‌ర్శ‌కుడిగా త‌ను కెరీర్ ను ప్రారంభించాడు. బిచ్చ‌గాడితో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. వైవిధ్య భ‌రిత‌మైన క‌థ‌ల‌కు పేరు పొందాడు. ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు త‌ను. ఎలాంటి పాత్ర‌లోనైనా జీవించేందుకు సిద్దంగా ఉంటాడు. ఇది ఆయ‌న స్పెషాలిటీ. తాజాగా త‌ను కీ రోల్ పోషించి, నిర్మించిన మూవీ మార్గాన్.

Maargan Movie Updates

ఇక ఈ చిత్రానికి ప్ర‌త్యేకత ఏమిటంటే ఫిలిం ఎడిట‌ర్ గా బాధ్య‌తలు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించిన లియో జాన్ పాల్ మొద‌టిసారిగా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ముఖ్య పాత్ర పోషించిన విజ‌య్ ఆంటోనీకి ధీటుగా త‌న మేన‌ల్లుడైన అజ‌య్ దిషాన్ కూడా సూప‌ర్ షో చేశాడు. త‌న యాక్టింగ్ , క్యార‌క్ట‌రైజేష‌న్ ఈ మూవీకే హైలెట్ గా నిలిచింది. ఇందులో సీన్స్ కూడా సూప‌ర్ గా ఉన్నాయి. కుటుంబ భావోద్వేగాల‌ను ఎక్కువ‌గా ప్ర‌తిఫ‌లించేలా తెర‌పై క‌నిపించేలా చేశాడు.

సినిమా చివ‌రి దాకా మిస్ట‌రీని కొన‌సాగిస్తూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు. సెకాండ‌ఫ్ కూడా ఎలాంటి బోర్ కొట్ట‌కుండా తీయ‌డం అభినంద‌నీయం. ఇక ఈ మూవీకి ప్ల‌స్ పాయింట్ ఏమిటంటే త‌ను స్వ‌యంగా ఎడిట‌ర్ కావ‌డంతో ఎక్క‌డ క‌త్త‌రించే ఛాన్స్ లేకుండా చూశాడు. ఇక సినిమా వ‌ర‌కు వ‌స్తే మార్గాన్ అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం, ఎడిటింగ్ , టెక్నిక‌ల్ క్వాలిటీస్ అన్నీ సూప‌ర్ గా ఉన్నాయి.

Also Read : Minister Parthasarathy Exclusive : అప్ప‌న్నను ద‌ర్శించుకున్న కొలుసు

Exit mobile version