Modi : ఢిల్లీ – కేంద్ర మంత్రివర్గం జాతీయ నూతన క్రీడా పాలసీకి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2036లో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ (Modi) అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. 2001 జాతీయ క్రీడా విధానానికి మరికొన్ని మెరుగులు దిద్దింది. చివరికి బ్లూ ప్రింట్ తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం పేరును వినిపించేలా తయారు చేయాలని తీర్మానం చేసింది కేబినెట్.
Modi Cabinet Approved Sports Bill
ఈ సందర్బంగా ప్రపంచ వేదికపై రాణించడాన్ని నిర్ధారించడం, క్రీడల ద్వారా ఆర్థిక వృద్ధిని , సామాజిక చేరికను ప్రోత్సహించడం, క్రీడలను ప్రజా ఉద్యమంగా మార్చడం, విద్యా వ్యవస్థలో క్రీడలను సజావుగా సమగ్ర పరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రీడా పాలసీ విధానం. ఈ విధానం అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు క్రీడా కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఫోకస్ పెడుతుంది.
ప్రతిభను గుర్తించడం, సమాన అవకాశాలు కల్పించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో శిక్షణ వ్యవస్థలను నెలకొల్పడం చేస్తుంది. కోచింగ్ ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేయడం, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ , టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం, క్రీడా సమాఖ్యల సామర్థ్యం, పాలనను పెంచుతూ అథ్లెట్లకు సమగ్ర మద్దతును నిర్ధారించడంపై దృష్టి పెడుతుంది. ప్రపంచ స్థాయి క్రీడా పోటీలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది మంత్రవర్గం.
Also Read : YS Jagan Shocking Decision : పాదయాత్ర చేస్తా ప్రజలను కలుస్తా – జగన్
