Minister Atchannaidu Shocking Comments : ప్ర‌జాస్వామ్యం గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టం విడ్డూరం

నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Shocking Comments

Hello Telugu - Minister Atchannaidu Shocking Comments

Minister Atchannaidu : అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఆయ‌న‌కు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే హ‌క్కు లేనే లేద‌న్నారు. శ‌నివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజకవర్గం లో జల జీవన్ మిషన్ పథకం పనులకు శంకుస్థాపనలు చేశారు. జగన్ కు ప్రజాస్వామ్యం గురించి, పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలోనే అరాచకం ఎలా ఉంటుందో, ప్రత్యక్షంగా నరకం అనుభవించారు రాష్ట్ర ప్ర‌జ‌లు.

Minister Atchannaidu Shocking Comments on YS Jagan

ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి, నిధులను పక్కదోవకు మళ్ళించి ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసిన ఆర్థిక నేరగాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అచ్చెన్నాయుడు. వైసిపి ఐదేళ్ల పాలనలో అందిన కాడికి అన్నిచోట్ల దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర త‌న‌దంటూ పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ వైకాపా నేతల బృందం గవర్నర్ కి ఇచ్చిన ఫిర్యాదు పత్రం ఈ శతాబ్దపు విడ్డూరమ‌ని ఎద్దేవా చేశారు.

నాడు వైసిపి ప్రభుత్వం లో 90 శాతం హామీలు నెరవేర్చలేని జగన్, ఆ పార్టీ నాయకులకు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత లేద‌ని స్ప‌ష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ 20 వేల రూపాయలను అందజేయనున్న‌ట్లు చెప్పారు మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు.

Also Read : Kala Venkatarao Warning to Botcha : ఉత్తరాంధ్ర ద్రోహి బొత్స సత్యనారాయణ

Exit mobile version