MP Eatala Rajender Shocking : ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ హ‌స్తం

ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - MP Eatala Rajender Shocking

Hello Telugu - MP Eatala Rajender Shocking

Eatala Rajender : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో క‌ల‌కలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender). మంగ‌ళ‌వారం ఆయ‌న సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందనేది వాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. ఈ ప‌నికి మాలిన , దిక్కు మాలిన వ్య‌వ‌హారం పూర్తిగా ఆనాటి ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఈటెల రాజేంద‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి.

MP Eatala Rajender Shocking Comments on KCR

ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. త‌న వ‌ద్ద ఉన్న మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, కుటుంబీకులు,ప్ర‌తిప‌క్ష నేత‌లు, ప్ర‌ముఖులు, వ్యాపార‌, వాణిజ్య‌వేత్త‌లు, క్రీడాకారులు, సినిమా రంగానికి చెందిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నీషియ‌న్స్ , జ‌ర్న‌లిస్టులు..ఇలా ప్ర‌తి ఒక్క‌రినీ టార్గెట్ చేశారు. దీనికి సీఐబీ చీఫ్ గా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ప్ర‌యారిటీ ఇచ్చాడు. ప్ర‌భాక‌ర్ రావుకు అంద‌లం ఎక్కించారు.

త‌ను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించాడు. ప‌దేళ్ల పాటు చుక్క‌లు చూపించారు. అనుకోకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డంతో ప్ర‌భాక‌ర్ రావు అమెరికాకు జంప్ అయ్యాడు. హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేశారు. త‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించింది స‌ర్కార్. సిట్ ఏర్పాటు చేసింది. చివ‌ర‌కు త‌ను రాక పోవ‌డంతో నోటీసులు జారీ చేసింది. స్పందించ‌క పోవ‌డంతో లుక్ ఔట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కూడా స్పందించ‌క పోవ‌డంతో సిట్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ వార్నింగ్ ఇచ్చింది.

దీంతో గ‌త్యంత‌రం లేక విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దాదాపు త‌ను విచారణ‌కు హాజ‌రైంది నాలుగోసారి. మాజీ డీజీపీ కేకే మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశిస్తేనే తాను ఫోన్లు ట్యాపింగ్ చేశాన‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Indian Weapons Growth : ఆయుధాల తయారీలో రోజురోజుకు పెరుగుతున్న భారత్ మార్క్

Exit mobile version