Pemmasani : అమరావతి – ఏ ప్రభుత్వాలు జాబ్స్ ఇవ్వమని కేవలం ప్రైవేట్ కంపెనీల ఏర్పాటు తోనే జాబ్స్ వస్తాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani). టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Pemmasani Chandra Sekhar Interesting Comments
ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పాలన్నారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. చేస్తున్న పనులను ప్రజలకు పూర్తిగా తెలిసేలా ప్రయత్నం చేయాలని సూచించారు పెమ్మసాని చంద్రశేఖర్.
ప్రధానంగా రాజధాని అమరావతిపై ఉన్న అపోహను తొలగించాలని అన్నారు.. నేడు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. ప్రభుత్వంపై నమ్మకం కలగాలి. ప్రతి నాయకుడు తమ తమ ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటుకు కృషి చేసి ఉద్యోగ కల్పనకు సహకరించాలని కోరారు కేంద్ర మంత్రి. పోలవరం పూర్తి అయితే రాష్ట్రం సస్యశామలంగా మారుతుందన్నారు..
స్కూల్స్, హాస్టళ్లు, ఆసుపత్రుల పరిశీలనలతో పాటు ప్రజా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందెలా నాయకులు నడుచుకోవాలి. చేసిన మేలును వివరంగా చెప్పుకోవాలి. ప్రజల మన్ననలు పొందగలిగితే మళ్లీ మళ్లీ గెలుస్తాం. క్రమం తప్పకుండా భారీ మెజార్టీలతో గెలుస్తున్న నాయకులే దీనికి ఉదాహరణ. ఇలా ఉంటే టీడీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదనేది వాస్తవం అన్నారు.
Also Read : Phone Tapping Sensational : కేంద్రం ఓకే అంటేనే రాష్ట్రాల్లో ట్యాపింగ్
