Phone Tapping Sensational : కేంద్రం ఓకే అంటేనే రాష్ట్రాల్లో ట్యాపింగ్

మోదీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

Hello Telugu - Phone Tapping Sensational

Hello Telugu - Phone Tapping Sensational

Phone Tapping : ఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌న‌లం సృష్టించింది. రాజ‌కీయ‌, సినీ, క్రీడా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మికంగా విచార‌ణ‌లో తేలింది. దీనిపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా విచార‌ణ‌కు ఆదేశించింది. ఇంకా విచార‌ణ పూర్తి కాలేదు. బాధితుల నుంచి వాంగ్మూలం సేక‌రిస్తున్నారు సిట్ అధికారులు.

Phone Tapping Sensational Updates

ఈ త‌రుణంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కు సంబంధించి మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సోమవారం అధికారికంగా గెజిట్ ను విడుద‌ల చేసింది. త‌మ అనుమ‌తి ఉంటేనే దేశంలోని రాష్ట్రాలలో ఫోన్ ట్యాపింగ్ చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది. లేక‌పోతే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించింది. 30 రోజుల్లో అమలులోకి కొత్త ప్రతిపాద‌న‌లు సిద్దం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అధికారాల‌పై ప‌రిమితులు విధించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇత‌ర రాష్ట్రాల్లోని వ్య‌క్తుల ఫోన్ లు ట్యాప్ చేయాలంటే ఇక నుంచి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి త‌ప్ప‌నిస‌రిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ట్యాపింగ్ అధికారం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం చేసింది.

Also Read : Purnachandar – Pocso Case Sensational : పూర్ణ చంద్ర నాయ‌క్ పై ఫోక్సో కేసు

Exit mobile version