Popular Business Man Gautam Adani : గౌతం అదానీ భార్య భావోద్వేగం

ఒకే ల‌క్ష్యంతో సాగిన జీవితం ఇది

Hello Telugu - Popular Business Man Gautam Adani

Hello Telugu - Popular Business Man Gautam Adani

Gautam Adani : భార‌తీయ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ (Gautam Adani) పుట్టిన రోజు ఇటీవ‌లే జ‌రుపుకున్నారు. త‌ను 63వ బ‌ర్త్ డే సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు త‌న భార్య ప్రీతి అదానీ. తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఇవాళ ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డిపామ‌ని పేర్కొన్నారు. త‌ను లేక పోతే నేను లేన‌ని అన్నారు. రూపాయి సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయ‌ని, కానీ వాటిని కాపాడు కోవ‌డం, భ‌ద్రంగా దాచు కోవ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని స్ప‌ష్టం చేశారు.

Gautam Adani Birthday

చాలా మంది రూపాయ‌లంటూ కొట్టి పారేస్తార‌ని, కానీ తాము వాటిని దైవం కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తామ‌ని అన్నారు ప్రీతి అదానీ. తాము ఒకే ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగామ‌ని తెలిపారు. ఆయ‌న ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, మ‌రెన్నో ఆటు పోట్ల‌ను త‌ట్టుకుని నిల‌బడ్డార‌ని, ఇదంతా త‌న ప‌ని ప‌ట్ల త‌న‌కు ఉన్న నిబ‌ద్ద‌తే కార‌ణ‌మ‌ని అన్నారు ప్రీతి అదానీ.

సంపాదించిన దాంట్లోంచి ఎక్కువ శాతం స‌మాజం కోసం ఖ‌ర్చు చేయాల‌న్న‌ది త‌మ ఉద్దేశ‌మ‌ని, ఆ దిశ‌గా తాము ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు. అందుకే అదానీ ఫౌండేష‌న్ ఇవాళ వేలాది మంది జీవితాల‌లో వెలుగులు నింపుతోంద‌న్నారు. మేం ఇద్ద‌రం, మా అదానీ కుటుంబం (కంపెనీలు, సిబ్బంది, కార్మికులు) అంతా ఆయ‌న న‌డుస్తున్న అడుగులో అడుగు వేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు కురిపించింది. ఈ అసాధార‌ణ ప్ర‌యాణంలో మీ ప‌క్క‌న న‌డ‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. మీరు స్థాపించిన ఈ మ‌హా సామ్రాజ్యంలో ఎంద‌రో సేద దీరేలా చేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

Also Read : CM Siddaramaiah – BJP Shocking Demands :సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా చేయాల్సిందే

Exit mobile version