RS Praveen Kumar Interesting Comments : ప్ర‌భాక‌ర్ రావుకు ఆర్ఎస్పీ క్లీన్ చిట్

త‌న‌ను ఇరికించేందుకు స‌ర్కార్ కుట్ర

Hello Telugu - RS Praveen Kumar Interesting Comments

Hello Telugu - RS Praveen Kumar Interesting Comments

RS Praveen Kumar : హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఐబీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar). త‌ను వృత్తి ప‌రంగా అత్యంత ప్ర‌తిభావంతుడ‌ని, ఉత్త‌మ అధికారిక‌గా రాష్ట్ర‌ప‌తి నుండి అవార్డులు కూడా అందుకున్నాడ‌ని ఆవేద‌న చెందారు. త‌న వ్య‌క్తిత్వాన్ని కించ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

RS Praveen Kumar Interesting Comments

ఇదిలా ఉండ‌గా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. ఒక బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడై ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌న స్థాయికి త‌గ‌దు. ఇప్ప‌టికే కేసు న‌మోదైంది. ఇంకా విచార‌ణ పూర్తి కానే లేదు. అప్పుడే ప్ర‌భాక‌ర్ రావుకు క్లీన్ చిట్ ఇస్తే ఇక కేసుకు అర్థం ఏముంటుంది. ఒక‌వేళ ఆర్ఎస్పీ చెప్పిన‌ట్టు ప్ర‌భాక‌ర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్ప‌డ‌క పోతే కాంగ్రెస్ స‌ర్కార్ ఏర్ప‌డిన వెంట‌నే ఎందుకు దేశం విడిచి వెళ్లి పోయాడో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. చివ‌ర‌కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తే కానీ ఇండియాకు రాలేదు. త‌ప్పు చేయ‌క పోతే ఎందుకు అమెరికాలో ఇన్నాళ్ల పాటు దాక్కున్నారో చెప్పాల్సి ఉంది.

చివ‌ర‌కు సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేస్తే త‌ప్పా త‌ను హైద‌రాబాద్ వ‌ర‌కు రాలేక పోయారు. మొత్తంగా కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో 4 వేల‌కు పైగా ఫోన్ల‌ను రాజ‌కీయ‌, క్రీడా, సినీ , వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల ఫోన్ నెంబ‌ర్ల‌ను ట్యాపింగ్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రి దీనిపై ఆర్ఎస్పీ ఏమంటార‌నేది చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read : Minister Pemmasani Interesting Comments : కంపెనీలు వ‌స్తేనే ఉద్యోగాలు వ‌స్తాయి

Exit mobile version