Sleeping Disorder : మీరు రోజూ 7 గంటల కన్నా తక్కువ పడుకుంటున్నారా..ఇవి భరించాల్సిందే

దీర్ఘకాలికంగా ఈ ప్రభావాలు తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు...

Hello Telugu - Sleeping Disorder

Hello Telugu - Sleeping Disorder

Sleeping Disorder : నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చిరాకు, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలికంగా ఈ ప్రభావాలు తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Sleeping Disorder – రోగనిరోధక శక్తిపై ప్రభావం

తగిన నిద్ర లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. శరీరం వైరస్‌లు, బాక్టీరియాల ప్రభావానికి లోనవుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వైద్యుల సూచన

ఎంతటి శ్రమ ఉన్నా, రోజుకు కనీసం 7-8 గంటల నిద్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే కీలక చర్యగా భావించాలి. వ్యాయామం, సమతుల్య ఆహారం, నిద్ర – ఈ మూడింటి సమతుల్యతతోనే జీవన నాణ్యత మెరుగవుతుంది.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడినది. నిద్రలేమి వంటి సమస్యలు ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Also Read : PM Kisan Interesting Update : రైతన్నలకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు జమ అయ్యేది అప్పుడే..

Exit mobile version