Supreme Court Shocking – Lalit Modi : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ ‘లలిత్ మోదీకి’ సుప్రీంకోర్టులో చుక్కెదురు

దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది...

Hello Telugu - Supreme Court Shocking - Lalit Modi

Hello Telugu - Supreme Court Shocking - Lalit Modi

Supreme Court : ఐపీఎల్ వ్యవస్థాపకుడు మరియు బీసీసీఐ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను బీసీసీఐ చెల్లించాలని కోరుతూ మోదీ (Lalit Modi) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.

Supreme Court Shocking to Lalit Modi

న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఫెమా ఉల్లంఘన ఒక వ్యక్తిగత కేసుగా భావించబడతుందని, ఈ తరహా పరిణామాలకు బీసీసీఐ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లలిత్ మోదీకి చట్ట ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు ఉన్నా, బీసీసీఐకు అది వర్తించదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇప్పటికే ఈ వ్యవహారంలో మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాను బీసీసీఐ అధికారికంగా నియమితుడునని, ఫెమా కింద విధించిన జరిమానా సంస్థే భరించాలన్న వాదనను హైకోర్టు తిరస్కరించింది. అదేవిధంగా, అర్ధరహిత వాదనతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఆయనపై రూ.లక్ష జరిమానా కూడా విధించింది.

ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన మోదీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

గతంలో ఐపీఎల్ నిర్వహణలో ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ, 2010లో భారత్‌ నుండి లండన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన విదేశాల్లోనే ఉంటున్నారు.

Also Read : Madras High Court Reject : భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అడ్డుకోలేం

Exit mobile version