Madras High Court : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు మెట్లు ఎక్కిన తమిళ నిర్మాతల సంఘానికి బిగ్ షాక్ ఇచ్చింది. తాము కోట్లు ఖర్చు పెట్టి తీస్తే రివ్యూల కారణంగా తమ మూవీస్ అట్టర్ ప్లాప్ అవుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు. ఈ రివ్యూలను ఆపేసేలా తీర్పు ఇవ్వాలని విన్నవించారు. దీనిపై వాదనలు కొనసాగాయి. అనంతరం కోర్టు (Madras High Court) తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం టెక్నాలజీలో భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని పరిశీలిస్తూ ముందుకు సాగాలని స్పష్టం చేసింది.
Madras High Court Rejeccts Movie..
కేవలం రివ్యూల కారణంగా సినిమాలు ఆడక పోవడం అనేది ఉండదని పేర్కొంది. కథలో కంటెంట్ ఉంటే, సినిమా బాగా వస్తుందని, ఆ తర్వాత మౌత్ టాక్ తో పెద్ద ఎత్తున తరలి వస్తారని దానిపై ఫోకస్ పెడితే మంచిదని సంచలన వ్యాఖ్యలు చేసింది కోర్టు ధర్మాసనం. ఎవరో కొందరు రివ్యూలు నెగటివ్ గా రాసినంత మాత్రాన, లేదా ప్రచారం చేసినంత మాత్రానా మూవీస్ ఆడక పోవడం, నష్ట పోవడం అంటూ జరగదని కుండ బద్దలు కొట్టింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాలకు పోటీ పెరిగింది. ఓటీటీలు రాజ్యం ఏలుతున్నాయి. కేవలం కొన్ని రోజులే ఆడుతున్నాయి చిత్రాలు. ఆ తర్వాత విచిత్రంగా స్ట్రీమింగ్ కావడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు థియేటర్ల వద్దకు రాలేక పోతున్నారు. దీంతో నష్టాలకు గురవుతున్నట్లు వాపోతున్నారు. చివరకు కీలక తీర్పు వెలువరించింది హైకోర్టు. మనిషికి రాజ్యాంగం తన అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు కల్పించిందని దీనిని అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
Also Read : నేను రౌడీని ఎవరికీ భయపడను – కొండా
