Supreme Court Warning :గ‌చ్చిబౌలిలో ప‌చ్చ‌ద‌నం కోసం ప్ర‌య‌త్నం

ఆపసోపాలు ప‌డుతున్న రాష్ట్ర అట‌వీ శాఖ

Hello Telugu - Supreme Court Warning

Hello Telugu - Supreme Court Warning

Supreme Court : హైద‌రాబాద్ – భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీవ్ర (Supreme Court) ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారం కేసు పూర్తిగా నిలిచి పోయింది. ఈ విలువైన భూముల‌ను అప్ప‌నంగా అమ్మేసి, కార్పొరేట్ కంపెనీల‌కు ధార‌ద‌త్తం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్లాన్ చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ విద్యార్థులు అభ్యంత‌రం తెలిపారు. సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, మేధావులు, క‌ళాకారులు, క‌వులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, వామ‌ప‌క్ష వాదులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు.

Supreme Court Warning for Gachibowli Lands

దీంతో ప్ర‌భుత్వం దిగి రాక త‌ప్ప‌లేదు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపై సీరియ‌స్ అయ్యారు జ‌డ్జి. త‌క్ష‌ణ‌మే అక్క‌డ ప‌చ్చ‌ద‌నం నెల‌కొల్పేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేక పోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో గ‌త్యంత‌రం లేక సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ మౌనం వ‌హించింది. కొట్టేసిన చెట్ల‌ను తిరిగి ఏర్పాటు చేయాల‌ని కొంత గ‌డువు ఇచ్చింది కోర్టు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌.

ఇదిలా ఉండ‌గా సుప్రీం సీరియ‌స్ అయినా ఇంకా ఆ దిశ‌గా ప‌నులు ప్రారంభించ‌లేదు. భూమి, నిధుల సమస్యల మధ్య కంచ గచ్చిబౌలి పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి అటవీ శాఖ కష్టపడుతోంది. భూ నియంత్రణ సమస్యలు, నిధుల కొరత కారణంగా కంచ గచ్చిబౌలి అడవి పునరుద్ధరణ నిలిచి పోయింది. జూలై 23 వ‌ర‌కు డెడ్ లైన్ విధించింది గ‌త మే 15న ఇచ్చిన తీర్పులో. ఈ సంవత్సరం ప్రారంభంలో సామూహిక చెట్ల నరికివేత వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని తిప్పికొట్టడానికి ఎటువంటి ముఖ్యమైన చర్య తీసుకోలేదు. ఈ విధ్వంసాన్ని సుప్రీంకోర్టు స్వయంగా స్వీకరించి, కేంద్ర సాధికార కమిటీ (CEC) సిఫార్సుల ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read : MLC Kavitha Shocking : క‌విత బీసీల జ‌పం స‌ర్కార్ పై యుద్ధం

Exit mobile version