TG High Court Sensational : అధికారుల ఉదాసీన‌త‌పై హైకోర్టు ఆగ్ర‌హం

ఫోటోల‌ను ట్యాంక్ బండ్ పై ప్ర‌ద‌ర్శించాలి

Hello Telugu - TG High Court Sensational

Hello Telugu - TG High Court Sensational

High Court : హైద‌రాబాద్ – తెలంగాణ హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల నిర్వాకంపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది ధ‌ర్మాస‌నం. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని ఆదేశించింది. సీరియ‌స్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును (High Court) ఆశ్రయించింది సయ్యద్ రహీమున్నీసాతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు.

TG High Court Slams

ఈ పిటిషన్‌పై విచారణ చేస్తూ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని ఆదేశించారు జస్టిస్ విజయసాయి రెడ్డి. అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతోంది, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నార‌ని, పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

అది శాంతి భద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం. వచ్చే వాయిదా లోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు జ‌డ్జి.

Also Read : Indian Govt Shocking : ఏపీకి కేంద్రం బిగ్ షాక్..బ‌న‌క‌చ‌ర్లకు అనుమతి ఇవ్వ‌లేం

Exit mobile version