Amit Shah : ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 లోపు నక్సలిజం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయుధాలు వదిలి లొంగి పోవాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే నక్సల్స్ తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ భయపెట్టాలని చూసిందన్నారు. కానీ ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఏమిటో దాయాది దేశంతో పాటు ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజాన్ని కూడా అంతం చేయాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Amit Shah Sensational Comments
ఏ ఒక్క నక్సలైట్ ఈ దేశంలో ఉండకూడదని, ఆ పేరు వినిపించకుండా, కనిపించకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దారికొస్తే సరి లేక పోతే తాట తీస్తామన్నారు. ఇప్పటికే చండీగడ్ , బస్తర్ లో మావోయిస్టులకు చుక్కలు చూపించడం జరిగిందని చెప్పారు అమిత్ చంద్ర షా (Amit Shah). ఇప్పటి వరకు తాము పలుమార్లు చర్చలకు రావాలంటూ సూచించామని కానీ మావోయిస్టులు ఒప్పుకోలేదన్నారు.
ఇప్పటి వరకు వేలాది మందిని నక్సలైట్లు హతమార్చారని, వారు చేసిన ఘాతుకాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు అమిత్ చంద్ర షా. కానీ తాము మాత్రం వాళ్లను లేకుండా చేయడమే ప్రధాన టార్గెట్ అంటూ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే మావోయిస్టుల భరతం పడుతున్నారు.
Also Read : Journalist Swetcha Sensational Case :స్వేచ్ఛ కేసులో పూర్ణకు 14 రోజుల రిమాండ్
