Yash Dayal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన పేస్ బౌలర్ యష్ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. ఘజియాబాద్‌కు చెందిన మహిళ ఒకరు అతనిపై ఈ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Yash Dayal Case
పరాధిన నివేదిక ప్రకారం, బాధితురాలు సమర్పించిన ఫిర్యాదును IGRS పోర్టల్‌లో నమోదు చేయగా, పోలీసులు ప్రాథమికంగా పరిశీలించి అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.
యష్ దయాల్ (Yash Dayal) ఇటీవల ముగిసిన టోర్నమెంట్‌లో విజయవంతంగా బౌలింగ్ చేస్తూ తన జట్టుకు టైటిల్ గెలుపులో సహకరించాడు. ఈ తరుణంలో వచ్చిన ఆరోపణలు అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పోలీసుల విచారణ అనంతరం యష్ దయాల్‌పై లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాధితురాలి ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read : RAW New Chief – Parag Jain Growth : రా కొత్త చీఫ్ గా పంజాబ్ క్యాడర్ అధికారి ‘పరాగ్ జైన్’
