Popular Cricketer Smriti Mandhana : మంద‌న్నా సెంచ‌రీ 771 పాయింట్లతో ముందంజ‌

23 పాయింట్ల వెనుకంజ‌లో ఉన్న భార‌త స్టార్ క్రికెట‌ర్

Hello Telugu - Popular Cricketer Smriti Mandhana

Hello Telugu - Popular Cricketer Smriti Mandhana

Smriti Mandhana : దుబాయ్ – భార‌తీయ మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంద‌న్నా అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌రోసారి మెరిసింది. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ పై సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకుంది. దీంతో టి20 ఫార్మాట్ లో ర్యాంకింగ్ లో టాప్ లోకి దూసుకు వెళ్లింది. నెంబ‌ర్ 1లోకి చేరుకోవాలంటే త‌ను ఇంకా 23 పాయింట్లు సాధించాల్సి ఉంది. స్మృతీ మంద‌న్నా కళ్లు చెందిరే షాట్స్ తో దుమ్ము రేపింది. త‌ను కేవ‌లం 62 బంతులు మాత్ర‌మే ఎదుర్కొంది. 112 పరుగులు సాధించింది. దీంతో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టుపై 97 ప‌రుగుల భారీ ఆధిక్యంతో సెన్సేష‌న్ విక్ట‌రీ సాధించింది భార‌త మ‌హిళా జ‌ట్టు.

Cricketer Smriti Mandhana Sensational

స్మ‌తీ మంద‌న్నా (Smriti Mandhana) త‌న క్రికెట్ కెరీర్ లో అత్యుత్త‌మ‌మైన పాయింట్ల‌ను సాధించింది. తాజాగా ఈ పొట్టి ఫార్మాట్ లో ఏకంగా 771 పాయింట్లు పొందింది. దీంతో త‌ను మూడో స్థానానికి చేరుకుంది. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1న ర్యాంక్ ప్లేయ‌ర్ బెత్ మూనీ కంటే 23 పాయింట్ల దూరంలో ఉంది. ఇదే క్ర‌మంలో స్మృతీ మంద‌న్నాతో పాటు మ‌రో భార‌తీయ ప్లేయ‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ కూడా బ్యాటింగ్ విభాగంలో 20 ర‌న్స్ చేసింది. త‌న ర్యాంకింగ్ లో 13వ స్థానానికి చేరుకుంది. హ‌ర్లీన్ డియోల్ 43 ర‌న్స్ తో 86వ స్థానానికి తిరిగి ప్ర‌వేశించ‌డం విశేషం.

ఇంగ్లండ్ కెపె్ట‌న్ నాట్ స్కైవ‌ర్ 42 బంతులు ఆడి 66 రన్స్ చేసింది. 20 పాయింట్లు పొందింది. 9వ స్థానాన్ని చేరుకుంది. త‌ను 663 పాయింట్లు సాధించింది.

Also Read : Modi Cabinet Approved : జాతీయ క్రీడా విధానానికి కేంద్రం ఆమోదం

Exit mobile version