Kannappa : మంచు మోహన్ బాబు సమర్పించిన మంచు విష్ణు , ప్రభాస్, అక్షయ్ కుమార్ , మోహన్ లాల్, కాజల్ నటించిన చిత్రం కన్నప్ప ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంలో మంచు ఫ్యామిలీలో సంతోషం వ్యక్తం అవుతోంది. నిన్నటి దాకా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న తరుణంలో ఉన్నట్టుండి మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు . శుక్రవారం తను స్పందించాడు. కన్నప్ప సినిమా అద్బుతంగా ఉందన్నాడు. అంతేకాదు తన సోదరుడు మంచు విష్ణు నటన సూపర్ గా ఉందంటూ కితాబు ఇచ్చాడు.
Manchu Manoj Comments on Kannappa Movie
దీంతో నిన్నటి దాకా కారాలు మిరియాలు నూరిన సదరు నటుడు ఉన్నట్టుండి బాగుందని చెప్పడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు మంచు విష్ణు. ఇదిలా ఉండగా కన్నప్ప చిత్రం విమర్శకుల మన్ననలు పొందింది. ప్రేక్షకులు సైతం విష్ణు నటనను మెచ్చుకున్నారు. రెండో పార్ట్ లో వచ్చే ప్రభాస్ కూడా ఎప్పటి లాగే తన నటనతో మెస్మరైజ్ చేశాడు.
ఇదిలా ఉండగా కన్నప్ప విడుదలకు ఒక రోజు ముందు మనోజ్ తన కుటుంబంతో కలిసి సినిమా చూశానని తెలిపాడు. తన సోదరుడు విష్ణు పేరును ప్రస్తావించక పోయినా, కన్నప్ప తాను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు మెరుగ్గా ఉన్నాడని ప్రకటించాడు. ప్రస్తుతం మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.
Also Read : Popular Cricketer Kohli : 40 కోట్ల పెట్టుబడితో కొత్త వ్యాపారం రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ
