Beauty Komalee Prasad : శ్వాస ఉన్నంత వ‌ర‌కు న‌టిస్తూనే ఉంటా

న‌టి కోమ‌లి ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Beauty Komalee Prasad

Hello Telugu - Beauty Komalee Prasad

Komalee Prasad : త‌న న‌ట‌న‌తో త‌క్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది న‌టి కోమ‌లి ప్ర‌సాద్. తాను డాక్ట‌ర్ కోర్సు చ‌దుకుంది. న‌ట‌న‌ను వ‌దిలేసి వెళ్లి పోతాన‌ని, సినిమా రంగాన్ని వ‌దులు కుంటానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని కొట్టి పారేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ను స్పందించింది. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాను ఫుల్ హ్యాపీగా ఉన్నాన‌ని తెలిపింది. తాను వ‌ర్క్ ను ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పింది. కావాల‌ని కొంద‌రు త‌న‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది.

Komalee Prasad Comments

ఇలాంటి కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల వారికే చేటు క‌లిగిస్తాయే త‌ప్పా త‌న‌కు ఏమీ కాద‌ని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ‌. చివ‌రి శ్వాస ఉన్నంత వ‌ర‌కు తాను సినిమాల‌లో న‌టిస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేసింది కోమ‌లి ప్ర‌సాద్ (Komalee Prasad). ఇదిలా ఉండ‌గా త‌ను శ‌శి వ‌ద‌నే అనే చిత్రంలో న‌టిస్తోంది. ప్రేక్ష‌కుల‌ను ప‌లక‌రించాల‌నే కోరిక త‌న‌లో క‌లుగుతోంద‌న్నారు. తాను న‌ట‌న‌కు దూర‌మై పోయాన‌ని, వైద్య వృత్తిలోకి వెళ్లి పోయానంటూ తెగ ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల బాధ‌ను వ్య‌క్తం చేశారు.

కావాల‌ని వదంతుల‌ను వ్యాప్తి చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. నా జీవితం అంతా న‌ట‌న‌లోనే ఉండాల‌ని కోరిక‌. ప్రాణం పోయేంత వ‌ర‌కు దీనిలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని స్ప‌ష్టం చేసింది యువ న‌టి కోమ‌లి ప్ర‌సాద్. తాను ఈ స్థాయి రావ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని, నా ఇష్ట దైవం ఆ ప‌ర‌మ శివుడిని న‌మ్ముకుని ఇంత దాకా వ‌చ్చాన‌ని పేర్కొంది కోమ‌లి ప్ర‌సాద్.

Also Read : Hero Pawan Kalyan – Hari Hara Veera Mallu : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుపై ఉత్కంఠ

Exit mobile version