Hero NTR – War 2 : వార్ 2 తెలుగు హ‌క్కులు నాగ వంశీ స్వంతం

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానున్న మూవీ

Hello Telugu - Hero NTR - War 2

Hello Telugu - Hero NTR - War 2

War 2 : బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. మల్టీ స్టార‌ర్ మూవీ ఇది. వార్ -2 (War 2) చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. గ‌తంలో వార్ -1 సూప‌ర్ హిట్ అయ్యింది. కోట్లు కొల్ల‌గొట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. దుమ్ము రేపింది. అభిమానుల‌ను సంతోష పెట్టేలా చేసింది. ఎన్టీఆర్ ఒకే ఒక్క సినిమాతో నేష‌న‌ల్ స్టార్ గా ఎదిగాడు. దీనికి కార‌ణం త‌ను న‌టించిన దేవ‌ర మూవీ. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు కొర‌టాల శివ‌. ఇది రూ. 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

War 2 Telugu Rights Acquires Producer Naga Vamsi

ప‌లు భాష‌ల‌లో విడుద‌ల చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో దేవ‌ర 2 సీక్వెల్ తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు.

మ‌రో వైపు త‌ను న‌టించిన వార్ -2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా తెలుగు రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ పొందారు. తార‌క్ ప‌ట్ల త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప్రేమ కార‌ణంగా స్వంతం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు . ఇక వార్ 2 చిత్రంలో తార‌క్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా య‌శ్ రాజ్ ఫిలిమ్స్ ప‌తాకంపై దీనిని నిర్మించారు.

అయితే తెలుగులో కూడా తామే రిలీజ్ చేస్తామ‌ని హిందీ చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. కానీ ఎన్టీఆర్ జోక్యంతో నాగ‌వంశీ భారీ ధ‌ర‌కు కోట్ చేసి ద‌క్కించుకున్న‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక వార్ -2 చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Also Read : Hero Ram Charan Fans : చెర్రీ ఫ్యాన్స్ ఫైర్ నిర్మాత శిరీష్ రెడ్డి సారీ

Exit mobile version