Beauty Rashmika Mandanna :అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ పైనే

త‌ను ప‌ట్టింద‌ల్లా బంగారం కానూ

Hello Telugu - Beauty Rashmika Mandanna

Hello Telugu - Beauty Rashmika Mandanna

Rashmika Mandanna : అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకుంది. యువ‌త హృద‌యాల‌నే కాదు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం త‌ను న‌టించిన కుబేర మూవీకి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. త‌న‌ను డిఫ‌రెంట్ రోల్ లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల. ఇందులో మ‌రో రెండు కీల‌క పాత్ర‌లు పోషించిన కోలీవుడ్ యాక్ట‌ర్ ధ‌నుష్, నాగార్జునకు సైతం మంచి మార్కులు ప‌డ్డాయి.

Rashmika Mandanna Attracts

ఇక ఈ ఏడాది మంచి ఆరంభం ఇచ్చింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌కు (Rashmika Mandanna). త‌ను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పుష్ప 2 మూవీ దుమ్ము రేపింది. దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఇది రెండో మూవీ క‌లెక్ష‌న్ల ప‌రంగా. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు కూడా.

ఇదిలా ఉండ‌గా ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. త‌ను అనుకోకుండా సినిమా రంగంలోకి వ‌చ్చింది. తొలుత ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత పరుశురామ్ తీసిన గీత గోవింద‌మ్ లో త‌ళుక్కున మెరిసింది. అద్భుత‌మైన ప్రేమ క‌థ ఇది. సంభాష‌ణ‌లు, చిత్రీక‌ర‌ణ‌, స‌న్నివేశాలు, పాట‌లు ఇలా ప్ర‌తిదీ ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో ర‌ష్మిక తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ కీ రోల్స్ పోషించాడు.

ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో న‌టించింది. మ‌హేష్ బాబుతో స‌రి లేరు నీకెవ్వరులో న‌టించింది. హిందీలో యానిమ‌ల్ లో దుమ్ము రేపింది. దీనికి వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇది రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత మ‌రాఠా యోధుడు జీవిత గాధ ఆధారంగా తెర‌కెక్కించిన ఛావా చిత్రంలో సూప‌ర్ రోల్ పోషించింది. ఇది రూ. 600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఆ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ తో న‌టించిన సికింద‌ర్ మూవీ ఆశించిన ఆడ లేదు. ఆ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల తీసిన కుబేర‌తో మ‌రోసారి త‌న స్టామినా ఏమిటో చూపించింది ర‌ష్మిక మంద‌న్నా. త‌న ఖాతాలో మ‌రో మూవీ వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం చాలా జాగ్ర‌త్త‌గా పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్న‌ట్లు చెప్పింది.

Also Read : TG High Court Warning :స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టు సీరియ‌స్

Exit mobile version