Hero Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్

ఇక కళారంగంలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులను అందించారు...

Hello Telugu - Hero Allu Arjun

Hello Telugu - Hero Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న గద్దర్ అవార్డ్స్  ఎట్టకేలకు నేడు ఘనంగా జరిగాయి. హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో గద్దర్ ఈవెంట్ వేదిక కళకళలాడిపోయింది. ఇక కళారంగంలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులను అందించారు. అంతేకాకుండా ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు.

Allu Arjun – Gaddar Awards

ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD నిలువగా.. ఉత్తమ నటుడు అవార్డును పుష్ప 2 కి గాను అల్లు అర్జున్ (Allu Arjun) అందుకున్నాడు. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అనే సినిమాకు అందుకుంది. ఇక కల్కి సినిమాకు గాను ఉత్తమ డైరెక్టర్ గా నాగ అశ్విన్ గద్దర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. నాకు ఈ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, కోమిటిరెడ్డి వెంకట రెడ్డి గారికి ధన్యవాదాలు. సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్.

స్పెషల్ థ్యాంక్స్ రాజమౌళి గారికి చెప్పాలి. ఆయనే కనుక పుష్ప 1 ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డ్. ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా ఫ్యాన్స్ కు డెడికేట్ చేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి ఏడాది ఈ వేడుక జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అంటూ ముగించాడు.

Also Read : Minister Savitha Sensational Comments : మాపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తా..!

Exit mobile version