Sholay : భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ఏకైక చిత్రం షోలే. ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది. ప్రపంచంలో ఎన్నదగిన సినిమాలలో ఈ మూవీ కూడా చేరింది. ఈ సినిమాకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఇది 1975లో విడుదలైంది. ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఇందులోని డైలాగులు కోట్లాది మందిని ఉర్రూతలు ఊగించేలా చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అరే ఓ సాంబా అన్న డైలాగ్ సెన్సేషన్.
Sholay Movie in Italy
షోలే (Sholay) చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ధర్మేంద్ర కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇటలీలోని బోలోగ్నా లోని పియాజ్ఞా మాగ్గియోర్ లో ఫెస్టివల్ జరగనుంది. బాలీవుడ్ క్లాసిక్ గా పేరు పొందింది. జూన్ 27న ప్రదర్శించనున్నారు. ప్రపంచ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో కొన్ని విషయాలు శాశ్వతంగా మన మనసుల్లో చెక్కబడి ఉంటాయని పేర్కొన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్.
అంతే కాదు షోలే గురించి మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఒక మరుపురాని అనుభవం మిగిలింది. భారతీయ సినిమాకు గొప్ప మలువు అవుతుందని పేర్కొన్నాడు. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పరుగులు తీసింది. కాసులు కొల్లగొట్టింది. ఇదిలా ఉంగా షోలే ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతం అని పేర్కొన్నాడు నటుడు ధర్మేంద్ర. సలీం జావెద్ అద్భుతమైన సంభాషణలు రాశాడు. షోలే చిత్రం యాక్షన్, థ్రిల్లర్, రివెంజ్, డ్రామా, కామెడీ, రొమాన్స్ , విషాదాలను మిళితం చేస్తుంది. దీనికి రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం అందించాడు. బిగ్ బి అమితాబ్ , ధర్మేంద్రతో పాటు సంజీవ్ కుమార్, హేమ మాలిని, జయ బాధురి, అమ్జాద్ ఖాన్ నటించారు.
Also Read : Fathima Sana Shiek Sensational :ఫాతిమా సనా షేక్ సెన్సేషన్
