Arjun Ambati : నాగ శివ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు దర్శకత్వం వహించిన చిత్రం పరమపద సోపానం. అర్జున్ అంబటి, ఇమ్మాన్యూయేల్ , సువర్ణలత కీ రోల్స్ పోషించారు. డేవ్ జాండ్ సంగీతం అందించారు. తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల జూలై 11న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే హీరోగా గుర్తింపు పొందాడు అర్జున్ అంబటి (Arjun Ambati). తను అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీ సినిమాలలో నటించాడు. భిన్నమైన పాత్రలను పోషించాడు.
Arjun Ambati Movie Updates
ఈ పరమపద సోపానం చిత్రాన్ని ఎస్ఎస్ మీడియా పతాకంపై గుడిమిట్ల శివకుమార్ నిర్మించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పించారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడిగా పేరు పొందాడు అర్జున్ అంబటి. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు. తప్పకుండా సినిమాను ఆదరిస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నాడు. సినిమాలోని తొలి లిరికల్ ట్రాక్ చిన్ని చిన్ని తప్పులేవో సాంగ్ వైరల్ అయ్యింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. రెండో సింగిల్ బూమ్ బూమ్ ను విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిని గీతా మాధురి పాడింది.
Also Read : Puri Jagannath Darshan Interesting : భాగ్యనగరం లోనే పూరీ జగన్నాథుని దర్శనం
