Hero Vijay Deverakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పై రాయదుర్గం పీఎస్ లో కేసు

ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు...

Hello Telugu - Hero Vijay Deverakonda

Hello Telugu - Hero Vijay Deverakonda

Vijay Deverakonda : టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌ రాయదుర్గం (Rayadurgam) పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్, తన ప్రసంగంలో గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదు నమోదైంది.

Vijay Deverakonda – Police Case

ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘ నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గిరిజనుల మనోభావాలను దెబ్బతీర్చేలా మాట్లాడారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన మాదాపూర్ ఏసీపీ శ్రీధర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఏమన్నాడు?

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో విజయ్ ఇలా అన్నాడు:
“ఇండియా, పాకిస్థాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలే పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు, బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు.”

అయితే “ట్రైబల్స్” అనే పదాన్ని వాడిన తీరు గిరిజనులను అవమానించేలా ఉందని గిరిజన సంఘాలు అభిప్రాయపడ్డాయి.

విజయ్ స్పందన:

వివాదం తెరపైకి వచ్చిన వెంటనే విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
“ట్రైబల్స్ అనే పదాన్ని వాడటం నిజమే కానీ, నేను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. పాత కాలంలో జరిగిన వర్గీయ ఘర్షణల ఉదాహరణగా ఈ పదాన్ని ఉపయోగించాను. ఎవరు నా వ్యాఖ్యలతో బాధపడ్డారో, వారికి నన్ను క్షమించమని కోరుతున్నాను,” అని వివరణ ఇచ్చాడు.

అయినప్పటికీ, ఇప్పుడు విజయ్ దేవరకొండపై అధికారికంగా కేసు నమోదు కావడంతో అతని అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ కేసు విచారణలో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

Also Read : Hero Vijay – Jana Nayagan : నెట్టింట వైరల్ అవుతున్న దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఫస్ట్ లుక్

Exit mobile version