Chiranjeevi Interesting : ఓటీటీలో ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి రెడీ అంటున్న మెగాస్టార్

అలాగే తాను ఓటీటీకే ఒకే అని.. ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు...

Hello Telugu - Chiranjeevi Interesting

Hello Telugu - Chiranjeevi Interesting

Chiranjeevi : ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై అలరించిన నాగార్జున.. ఇప్పుడు విభిన్న పాత్రలలో మెప్పిస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత మరోసారి ముఖ్యమైన పాత్రతో మెప్పించారు. నాగార్జున, హీరో ధనుష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర (Kuberaa). డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ..ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా వచ్చి చిత్రయూనిట్ ను అభినందించారు. అలాగే తాను ఓటీటీకే ఒకే అని.. ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Chiranjeevi Interesting Comments

“నేను ఇక్కడికి అతిథిగా రాలేదు.. ఆత్మీయుడిలా వచ్చాను.. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునను కలిసినప్పుడు కుబేర సినిమా గురించి అడిగాను. ఇది చాలా డిఫరెంట్ మూవీ నేను కూడా ఇప్పటివరకు చేయని విధంగా క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పాడు. అలాగే ఇందులో ధనుష్ లీడ్ రోల్ అని నాగ్ చెప్పినప్పుడు నువ్వేలా చేశావ్ అని అడిగాను.. అప్పుడు ఒకటే మాట చెప్పాడు. ఎప్పుడూ హీరోగా చేసి చేసి విసుగొచ్చింది.. అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను.. ఇది వర్కవుట్ అయితే నాకు చాలా రోల్స్ రావడానికి గేట్స్ ఓపెన్ అయినట్లే అని నాగ్ అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా నాగ్.. నీకు ఇలాంటి ఎన్నో మంచి రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇందాక నువ్వు మాట్లాడుకో ఇంకో 40 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పావ్ కదా.. నాకు నిజమే అనిపిస్తుంది. అయితే నీతో పాటు సమానంగా నేను కూడా వచ్చేసాతను.. హీరో పాత్రలే కాదు.. రేపు అవసరం అయితే ఓటీటీలో ఏమైనా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ.. ఇలా చెప్పాను కదా అని పొద్దున్నే క్యారెక్టర్స్ పట్టుకుని వచ్చేయకండి ” అని చిరంజీవి అన్నారు.

అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. 25 ఏళ్లల్లో 10 సినిమాలు మాత్రమే శేఖర్ చేశాడు. కానీ అవన్నీ ఆణిముత్యాల్లాంటి సినిమాలు. 1998లో స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఫస్ట్ టైమ్ చూశానని శేఖర్ చెప్పాడు. అప్పుడు నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని బలంగా అనుకున్నాడట. నన్ను స్పూర్తిగా తీసుకుని శేఖర్ ఈ స్థాయికి రావడం నాకు గర్వంగా ఉంది అని అన్నారు చిరు.

Also Read : Hero Shahid Kapoor – Deva : థియేటర్ లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్

Exit mobile version