Fatima Sana Shaik : ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్‌ను గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడు చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పు పట్టలేదని వివరణ ఇచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఉంటుందని నేను అనలేదు. ఆ పరిశ్రమలో నాకు ఎదురైన సంఘటనలను గురించి మాత్రమే చెప్పా. నా వ్యాఖ్యల చుట్టూ పెద్ద వివాదమే జరిగింది. మహిళలకు ప్రతి పరిశ్రమలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో తెలియడం లేదు. నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తి ఒక చిన్నస్థాయి క్యాస్టింగ్ ఏజెంట్ లేదా నిర్మాత అయి ఉండొచ్చు. అంతేకానీ, ఆ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కాదు’’ అని అన్నారు.
Fatima Sana Shaik Shocking Comments on Casting Couch
2015లో విడుదలైన ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే తెలుగు సినిమా కోసం ఫాతిమా (Fatima Sana Shaik) పని చేశారు. ఈ సినిమా తర్వాత ఆమె ‘దంగల్’లో భాగమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది కొన్నాళ్ల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ దక్షిణాదిలో వర్క్ చేయడంపై మాట్లాడారు. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. ‘‘దక్షిణాదిలో సినిమాలు చేస్తున్న రోజుల్లో ఒక క్యాస్టింగ్ ఏజెంట్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్దమేనా అని అడిగాడు. అతని మాటల్లోని డబుల్ మీనింగ్ మొదట నాకు అర్థం కాలేదు. పాత్ర కోసం ఎంత్తైనా కష్టపడతానని నేను చెప్పా. కానీ, ఆ వ్యక్తి మాత్రం అదే మాటను పదేపదే మాట్లాడాడు. దాంతో అతడి మాటల్లోని అర్థాన్ని గ్రహించా. హైదరాబాద్‌లో మరో సంఘటనను ఎదుర్కొన్నాను. అక్కడ కొంతమంది నిర్మాతలు హీరోయిన్స్‌తో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటారు’’ అని అన్నారు.
Also Read : MLA KTR Shocking : మాజీ మంత్రి కేటీఆర్ పై సైబర్ క్రైమ్ స్టేషన్ లో కేసు
