Mohanlal : మలయాళ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. అయితే ఇటీవల మమ్ముట్టి కాస్త అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో కీలక పాత్రధారి మోహన్‌లాల్ మాత్రం ఆయన పార్ట్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా కీలక షెడ్యూల్ కోసం శ్రీలంకకు వెళ్లారు మోహన్‌లాల్ (Mohanlal). ఈ నేపథ్యంలోనే ఆయన పార్లమెంటులో అక్కడి ప్రధానమంత్రి హరిణి అమర సూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘శ్రీలంక పార్లమెంటుకు నన్ను ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉంది. ప్రధాని హరిణి అమరసూర్య, స్పీకర్ జగత్ విక్రమరత్న, డిప్యూటీ స్పీకర్ రిజ్వీ సాలిహ్, నా స్నేహితుడు ఇశాంత రత్నాయకేలను కలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ పర్యటన మరచిపోలేని జ్ఞాపకం అని మోహన్‌లాల్ ట్వీట్ చేశారు.
Mohanlal Sri Lanka Visit
అలాగే తమిళ హీరో అజిత్ నటిస్తున్న చిత్రంలోనూ మోహన్‌లాల్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం హీరో మోహన్‌లాల్‌ను రంగంలోకి దించేందుకు అజిత్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దీనిపై మోహన్‌లాల్ సానుకూలంగా స్పందించరిఇన కోలీవుడ్ మీడియా చెబుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్‌తోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో అజిత్ సరసన శ్రీనిధిశెట్టి కథానాయిక అని టాక్ నడుస్తోంది.
Also Read : Hero Pawan – Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జులై 24న పక్కా..
