Hero Prabhas-The Raja Saab : ది రాజా సాబ్ సినిమా సీక్వెల్ పై డైరెక్టర్ కీలక అప్డేట్

దీనికి సీక్వెల్‌ ఉంటుందా లేదా అన్నద విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు...

hello telugu - Hero Prabhas-The Raja Saab

hello telugu - Hero Prabhas-The Raja Saab

The Raja Saab : “ప్రభాస్‌ దర్శకుల హీరో. దర్శకుడు ఏం కోరుకుంటే ఆవిధంగా పాత్రలో ఒదిగిపోతారు. గతంలోనూ ఆయన కామెడీ జానర్‌ చిత్రాలు చేశారు. అందులో ఆయనకంటూ ప్రత్యేకమైన టైమింగ్‌ ఉంది. దానిని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. ఈ సినిమాతో అది చేశా. ప్రభాస్‌ సినిమా అంటూ భారీతనం ఉండాలి. అందుకే కథానుగుణంగా భారీ సెట్స్‌ వేశాం’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) . సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా రన్‌టైమ్‌ గురించి చెప్పారు. దీనికి సీక్వెల్‌ ఉంటుందా లేదా అన్నద విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Hero Prabhas-The Raja Saab Trailer Sensational

ప్రభాస్‌ (Prabhas) దర్శకుల హీరో. ఇలాంటి హీరోతో మళ్లీమళ్లీ పని చేయాలనిపిస్తుంటుంది. మొదటి మారుతితో సినిమా అవసరమా అని చాలామంది నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశారు. నేను ప్రభాస్‌కు వీరాభిమానిని. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగా చూపించా. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అదేంటో సినిమాలో చూపిస్తా. ఇందులో ప్రభాస్‌ మంచి డాన్స్‌ నంబర్‌ ఉంది. హీరో ఎంట్రీ సాంగ్‌ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్స్‌తో హీరోకు ఒక చక్కని పాట ఉంటుంది.

ఆ సాంగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తారు. తమన్‌ సంగీతం అలరిస్తుంది. ఇక రన్‌ టైమ్‌ విషయానికొస్తే సినిమా మూడు గంటలు ఉంటుంది. మూడు గంటలకు టక్కున గడిచిపోతుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా అంటే అది సినిమా పూర్తయ్యాక చూద్దాం. పార్ట్‌ 2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దను. అయితే దీనిపై మాకు ఓ క్లారిటీ ఉంది. నటీనటులకు సుమారు 8 గంటల షిఫ్ట్‌ అనేది సాధారణంగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం మేము 18 గంటలపాటు కూడా వర్క్‌ చేశాం. అందుకే మంచి అవుట్‌పుట్‌ తీసుకురాగలిగాం’’ అని అన్నారు.

ఈ జానర్‌లో సినిమా అనగానే నేనేం కంగారు పడలేదు. ఈ జానర్‌లో సినిమా చేద్దామని ఆయనే అడిగారు. అప్పుడు నేను కంగారుపడ్డాను. ‘ప్రేమకథా చిత్రమ్‌’ వచ్చాక అదే జానర్‌లో సుమారు 500 చిత్రాలు వచ్చాయి. వారానికో హారర్‌ కామెడీ మూవీ విడుదలైంది. దానిని మించి ఏం చేయాలని కంగారుపడ్డాను. విభిన్నంగా ఏం చేయాలా? అని ఆలోచించి ఫిక్స్‌ కావడానికి ఎక్కువ టైమ్‌ పట్టింది. నేను అనుకున్న కథ బాగా వర్కౌట్‌ అయింది. ప్రభాస్‌కు నాపై ఉన్న నమ్మకంతోనే ఈ కథ చేశా.

“తొలిసారి ప్రభాస్‌ను కలిసినప్పుడు చాలా కంగారు పడ్డాను. ఆయన ఈ సినిమా ఒప్పుకుంటారా? లేదా అని. కానీ కథ విన్న 10 నిమిషాల్లో ఓకే చేశారు. సినిమా షూటింగ్‌కు దాదాపు రెండేళ్లు పట్టింది. గతేడాది కీలక షెడ్యూల్‌ చేశాం. ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలైతే రాత్రి 11 గంటల వరకు జరిగేది. సుమారు 120 రోజులకు పైగా ఇదే షెడ్యూల్‌ జరిగింది. ఆ సమయంలోనే క్లైమాక్స్ చిత్రీకరించాం. వీఎఫ్‌ఎక్స్‌ కోసం సుమారు 300 రోజులు కేటాయించాం. 40 నిమిషాల క్లైమాక్స్‌ గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉంటుంది. గతేడాది మా బ్యానర్‌ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు మిశ్రమ ఫలితాల్ని ఇచ్చాయి. దాంతో చాలా నిరాశకు గురయ్యాం. వాటన్నింటికీ సరైన సమాధానం చెప్పే చిత్రమిది. మాకు బ్యానర్‌కు భారీ చిత్రమిది.

Also Read : Konda Surekha Shocking : కేంద్రం తెలంగాణకు గోదావరి నిధుల కేటాయింపులో అన్యాయం

Exit mobile version