Hero Prabhas-The Raja Saab : డార్లింగ్ ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ రిలీజ్ పై కీలక అప్డేట్

దీంతో అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు...

Hello Telugu - Hero Prabhas-The Raja Saab

Hello Telugu - Hero Prabhas-The Raja Saab

The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వ‌స్తున్న క్రేజీ మూవీ ‘ద రాజాసాబ్’ . కామెడీ, హారర్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ మూవీ షూటింగ్ అప్పుడెప్పుడో మొద‌లైంది. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌దిలిన ఫ‌స్ట్ పోస్ట‌ర్, పిక్స్.. అంచ‌నాల‌ను పీక్స్ కు తీసుకెళ్లాయి. ఆ త‌ర్వాత ఈ మూవీ నుంచి పెద్ద‌గా అప్డేట్స్ ఏవీ లేవు. దీంతో అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా వారి ఎదురుచూపులు ఫ‌లించ‌బోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ బజ్ నడుస్తోంది. టీజర్ విడుదల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల దర్శకుడు మారుతి చిత్రానికి సంబంధించిన ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ను షేర్ చేసి, హ్యాపీ న్యూస్ రాబోతోంద‌న్న‌ హింట్ ఇచ్చారు . అయితే అదేంటో ఫైన‌ల్లీ తెలిసిపోయింది. ఈ సినిమా టీజ‌ర్ అతి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌ద‌ల‌బోతున్నారు మేక‌ర్స్.

Prabhas-The Raja Saab Movie Teaser Release

‘ద రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ 2025 జూన్ 16న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే కాదు.. మ‌రో క్రేజీ న్యూస్ కూడా ఉంది. ఈ టీజర్ యూట్యూబ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో కూడా రిలీజ్ అవుతుంది. థియేటర్ల జాబితాను త్వరలోనే ప్రకటించ‌బోతున్నారు.మ‌రోవైపు అజీజ్‌నగర్ సెట్‌ లో టీజర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘ ద రాజాసాబ్’ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. మొత్తానికి ప్ర‌భాస్ అభిమానుల ఎదురుచూపుల‌కు చిన్న కామా ప‌డ‌బోతోంది.

Also Read : Hero Ram Charan-Vanga : యానిమల్ డైరెక్టర్ వంగా డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ సినిమా

Exit mobile version